హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం ఘనంగా కొనసాగుతోంది. భాగ్యనగర నలుమూలల నుంచి తరలివస్తోన్న వినాయక విగ్రహాలు గంగమ్మ ఒడిలోకి చేరుతున్నాయి. బేగం బజార్‌కు చెందిన మార్వాడీలు గణపతి ప్రతిమను హుస్సేన్ సాగర్‌కు తీసుకొచ్చారు.
వినాయక విగ్రహం ముందు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల మార్వాడీలంతా ముఖానికి మాస్కు ధరించి స్టెప్పులేశారు.