హైదరాబాద్ మహానగర పాలక మండలి మేయర్, డిప్యూటీ మేయర్లు తమ పదవీ బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని 7వ అంతస్తులో మేయర్ ఛాంబర్‌లో సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మేయర్‌గా గద్వాల్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత పదవీ బాధ్యతలు తీసుకుని దస్త్రంపై తొలి సంతకం చేశారు.
మేయర్ తాను కలిసి ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని మోతె శ్రీలత తెలిపారు. కార్పొరేటర్లతో కలుపుకుని పనిచేస్తామని....ఉద్యమం కోసం ఎలా పనిచేశామో డిప్యూటీ మేయర్‌గా కూడా అలాగే పనిచేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్లమెంట్ సభ్యుడు కె.కేశవరావు, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్లు హాజరై మేయర్ విజయలక్ష్మీని అభినందించారు.
- ఇదీ చూడండి : స్థానికంగానే న్యాయవాద దంపతుల హత్య కేసు దర్యాప్తు..!