కంటోన్మెంట్ పరిధిలో పేదల ఇళ్లను మిలటరీ అధికారులు తొలగించకుండా చర్యలు తీసుకోవాలని... ప్రజా యుద్ధనౌక గద్దర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. సర్వే నెంబర్ 377లో ముప్పై ఏళ్లుగా పేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారని... రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి పట్టాలు కూడా ఇచ్చిందని వివరించారు.
పేదల ఇళ్లను కూల్చేందుకు వచ్చిన అధికారులకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు చూపించడం వల్ల కూల్చివేత పనులు నిలిపివేసినట్టు గద్దర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించేలా కృషి చేయాలని కోరారు. అప్పటి వరకు పనులు నిలుపుదల చేసే విధంగా బోర్డు అధ్యక్షుడితో మాట్లాడి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: 'పద్మశ్రీ' కనకరాజుకు మంత్రి అల్లోల సన్మానం