2005లో కర్ణాటకలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన దాడిలో తను కూడా ఉన్నట్లు సమాచారం రావడం బాధ కలిగించిందని గద్దర్ అన్నారు. ఆ సమయంలో తాను అజ్ఞాతంలో ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1990 ఫిబ్రవరిలోనే నక్సలిజం వదిలి కుటుంబంతోపాటు జనజీవన స్రవంతిలో కలిసినట్లు స్పష్టం చేశారు. 1997లో తనపై హత్యాయత్నం జరిగినప్పుడు వెన్నుపూస వద్ద బుల్లెట్ ఉండిపోవటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే... పరారీలో ఉన్నానని అనటం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుకను అయినందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నాయన్నారు. కేసులు ఎత్తివేసే బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: కర్ణాటక పోలీసుల కస్టడీలో వరవరరావు