నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో భవన నిర్మాణ అనుమతుల్లో అవినీతికి, ఆలస్యానికి తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన టీఎస్- బీపాస్ విధానం నేటి నుంచి పూర్తి స్థాయిలో అమలు కానుంది. మూడు నెలల క్రితమే అమల్లోకి వచ్చినప్పటికీ పాత విధానమైన డీటీసీపీ ద్వారానే అధికంగా భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేశారు.
ఇవాల్టి నుంచి యజమానులు ఇంటి నిర్మాణానికి టీఎస్- బీపాస్ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదుచేసి అనుమతులు పొందాల్సి ఉంటుందని మున్సిపల్ అధికారులు తెలిపారు. ప్రజలు మీసేవా కేంద్రం, టీఎస్- బీపాస్ మొబైల్ యాప్ ద్వారా సైతం దరఖాస్తు చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. అయితే జీహెచ్‌ఎంసీలో ఇప్పటికే బీపాస్ విధానం అమలవుతోంది.