పొగ తాగడం, మద్యం సేవించడం వంటి దురలవాట్ల వల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. మద్యం, పొగ వంటి దురలవాట్లను మానేసి, వాటి వల్ల తలెత్తే అనర్థాల నుంచి తప్పించుకోడానికి నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటే.. అందులోని ఫ్లేవనాయిడ్లు ఒంట్లోని వాపు ప్రక్రియ నివారణకు తోడ్పడుతాయి. అంతేకాదు.. ప్రాణాలకు వాటిల్లే ముప్పు నుంచి కూడా కాపాడుతాయంటున్నారు.
పండ్లు, కూరగాయల్లో ఉండే ఫ్లేవనాయిడ్ల ప్రభావం పొగ, మద్యం తీసుకునే వారి మీద అధికంగా ఉంటుంది. ఈ దురలవాట్ల వల్ల పూర్తిగా ప్రాణాపాయం తప్పకపోయినా.. ప్రాణాలకు కొంతవరకైనా రక్షణ కల్పిస్తాయంటున్నారు. అందుకే.. జామ, అరటి, ఆపిల్, పాలకూర, గోబిపువ్వు, క్యాబేజి, తేయాకు వంటి పండ్లు, కూరగాయలు తరచూ తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇద చదవండి: పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ