ETV Bharat / city

కరోనా వేళ.. ‘నకిలీ’లతో జాగ్రత్త..! - fraude with name of help to covid patients

సేవలను కూడా సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు అక్రమార్కులు. కరోనా వేళ స్వచ్ఛంద సంస్థలు పేరుతో డబ్బులు దండుకుంటున్నారు. బాధితులకు సాయం కావాలంటూ... సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి అందాల్సిన నగదును మింగేస్తున్నారు.

fraud on covid patients help money
fraud on covid patients help money
author img

By

Published : May 27, 2021, 8:55 AM IST

కరోనా వేళ స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లు చేతనైన సాయం చేసి ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఆహారంతో పాటు రోగులకు కావాల్సిన మందులు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, ఆసుపత్రుల్లో పడకలు అవసరమైన వారికి నిర్ధారిత సమాచారం అందిస్తున్నారు. వాటిని సంబంధించిన అభ్యర్థనలు, సేవలు ఎక్కువగా సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్నాయి. అయితే కొందరు కేటుగాళ్లు బాధితుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల నుంచి ఫోన్లు చేస్తున్నామంటూ నమ్మిస్తూ వారి నుంచి వేలాది రూపాయలు దండుకుంటున్నారు. రెమ్‌డెసివిర్‌, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, టోసిలిజుమాబ్‌ తదితర ఇంజక్షన్లు కావాలంటూ ఫోన్‌ నంబర్‌, దవాఖానాతో పాటు ఇతర వివరాలను అందులో పోస్ట్‌ చేస్తుండటంతో కేటుగాళ్లు నేరుగా బాధితులకు ఫోన్‌ చేసి నగదు బదిలీ చేయాలని చెబుతున్నారు.

నేరుగా ఆసుపత్రికే పంపుతామంటూ...

బ్లాక్‌ఫంగస్‌ బారిన పడిన ఓ వ్యక్తి నగరంలోని ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. లిపోసోమల్‌ ఆంపోటెరిసిన్‌ బి ఇంజక్షన్‌ ఇవ్వాలని వైద్యులు సూచించడంతో సామాజిక మాధ్యమాల్లో సాయం చేయమంటూ పోస్ట్‌ పెట్టారు. కొద్ది సమయం తర్వాత డబ్బు పంపిస్తే నేరుగా ఆసుపత్రికే ఇంజక్షన్‌ వయల్స్‌ను పంపుతామంటూ చెప్పారు. బయటి మార్కెట్‌లో ప్రయత్నించినా లభ్యం కాకపోవడంతో వాళ్లకు ఆ ఫోన్‌కాల్‌ ఎంతో ఊరటనిచ్చింది. వెంటనే చెప్పిన ఖాతాకు డబ్బు పంపారు. రాత్రి వరకు వేచి చూసినా రాకపోవడంతో మోసపోయామని గ్రహించారు.

నా పేరుతో ఫోన్‌ చేసి డబ్బు అడిగారు

- సాయిచరణ్‌, వాలంటీర్‌

ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో రెమ్‌డెసివిర్‌ వంటి ఇతర ఇంజక్షన్లు అవసరం ఉంటే కేటీఆర్‌ కార్యాలయం లేదా ఎమ్మెల్సీ కవిత కార్యాలయానికి, డిస్ట్రిబ్యూటర్లకు అనుసంధానం చేసి బాధితులకు అందేలా చూస్తున్నా. బాధితులు ట్విటర్‌ ద్వారా నన్ను ట్యాగ్‌ చేస్తూ సాయం అడుగుతున్నారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం ఓ వ్యక్తి రోగి కోసం మందులు కావాలంటూ ట్విటర్‌లో నా ఖాతాను ట్యాగ్‌ చేశారు. దీంతో ఓ వ్యక్తి నా పేరుతో వారికి ఫోన్‌ చేసి డబ్బు పంపమని చెప్పగానే బాధితులు ఫోన్‌పే ద్వారా పంపారు. తరువాత నాకు తెలిసిన వ్యక్తి ఫోన్‌ చేసి జరిగిన విషయం చెప్పారు. వెంటనే సైబర్‌క్రైం పోలీసుల దృష్టికి తెచ్ఛా వరంగల్‌కు చెందిన నిఖిల్‌ అనే వ్యక్తి ట్విటర్‌ ద్వారా బాధితుల నంబరుకు నా పేరుతో ఫోన్‌ చేశారని తెలిసింది.- సాయిచరణ్‌, వాలంటీర్‌

ఇదీ చూడండి: బ్లాక్‌ ఫంగస్‌ రోగులకు సరోజినీదేవి ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.