Flyover from Mindspace to Gachibowli: అవుటర్ రింగ్‌రోడ్డు(ఓఆర్‌ఆర్) నుంచి హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించే వాహనాల సంఖ్య 2040 నాటికల్లా ప్రతిగంటకు 5,200 దాటుతుందనేది ఓ అంచనా. ఈ క్రమంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్‌ఆర్‌డీపీ) ప్రాజెక్టులో భాగంగా రహేజా మైండ్‌స్పేస్ నుంచి గచ్చిబౌలి ఓఆర్‌ఆర్ వరకు నాలుగులైన్ల శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు.
ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని రంగరించి 823 మీటర్ల పొడవు, 16.60 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న ఈ వంతెన నగరంలోని పొడవైన సేతువుల్లో ఒకటిగా నిలవనుంది. దీనికోసం 14.5 మీటర్ల వెడల్పు, 23 మీటర్ల పొడవుతో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే మొదటిసారి స్టీల్ పోర్టల్ ఫ్రేమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వంతెన పనులు వేగంగా పూర్తిచేసి వచ్చేనెలలో ప్రారంభించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ఫ్లైఓవర్ నుంచి గచ్చిబౌలి వంతెన కన్నా ముందే వాహనాలు కిందకు దిగేందుకు వీలుగా ఓ ర్యాంపు ఉంటుంది. మరోటి నేరుగా బాహ్యవలయ రహదారిని కలుపుతుంది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని భావిస్తున్నారు. మరోవైపు గచ్చిబౌలి ఓఆర్‌ఆర్ నుంచి కొండాపూర్ వైపు 816 మీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో రెండో వంతెన పనులూ మొదలుపెట్టారు.
ఇవీ చదవండి: