పేద జీవుల బతుకు దెరువు ఆసరా పింఛన్ సొమ్మను కాజేసిన నిందితులు పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ పాతబస్తీలో వెలుగు చూసిన ఈ కుంభకోణంలో నలుగురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. 250 మంది వృద్ధుల పింఛన్ సొమ్మును ప్రభుత్వ ఉద్యోగి అస్లాం సాయంతో మూడు నెలలుగా నలుగురు నిందితులు కాజేసినట్లు తెలిసింది. నిందితులంతా పాతబస్తీకి చెందిన వారిగా గుర్తించారు. జిల్లా కలెక్టర్ మాణిక్ రాజ్ ఫిర్యాదుతో ఆసరా స్కాం బయటపడింది. నిందితులు అస్లాం 2017లో పింఛన్ల కుంభకోణంలో కూడా జైలుకు వెళ్లొచ్చినట్లు గుర్తించారు. ఈ కేసులో మరికొందరు ఉన్నారని... వారి కోసం గాలిస్తున్నట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: పింఛన్లు పక్కదారి... మరి పైసలు ఎవరి ఖాతాల్లోకి...?