ETV Bharat / city

ఆ బకాయిలు ఇప్పించండి.. సుప్రీంలో అమరావతి నిర్మాణ సంస్థ పిటిషన్

supreme court on Amaravathi: అమరావతి నిర్మాణ సంస్థ ఫోస్టర్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించాలంటూ ఆర్బిట్రేషన్‌  పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్​పై స్పందించిన సుప్రీంకోర్టు.. అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ అభివృద్ధి అథారిటీకి నోటీసులిచ్చింది.

supreme court on Amaravathi
supreme court on Amaravathi
author img

By

Published : Aug 11, 2022, 2:47 PM IST

Amaravathi: ఆంధ్రప్రదేశ్‌ నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించాలంటూ.. అమరావతి నిర్మాణ సంస్థ ఫోస్టర్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆర్బిట్రేషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్​పై స్పందించిన సుప్రీంకోర్టు.. అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ అభివృద్ధి అథారిటీకి నోటీసులు జారీ చేసింది. ఫోస్టర్‌ సంస్థ పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ఆదేశించింది.

Foster company: అమరావతి రాజధాని నిర్మాణం కోసం.. ఫోస్టర్ సంస్ష గతంలో పనిచేసింది. రాజధాని నిర్మాణ ప్రణాళిక, భవన ఆకృతులు రూపొందించింది. అయితే.. తమకు రావాల్సిన సొమ్ము మాత్రం చెల్లించలేదని పేర్కొంది. బకాయిలపై ఏఎమ్​ఆర్డీఏకి లేఖలు, నోటీసులు పంపినా సమాధానం లేదన్న కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. 2019 జూన్‌ తర్వాత నుంచి బకాయిలపై పలుమార్లు లేఖలు రాసినట్లు వెల్లడించింది.

ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపింది. తమకు రావాల్సిన నిధులను మధ్యవర్తిత్వం ద్వారా ఇప్పించాలని సుప్రీంకోర్టును కోరింది ఫోస్టర్ సంస్థ. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ అభివృద్ధి అథారిటీకి నోటీసులు జారీచేసింది.

ఇవీ చదవండి: అలా ప్రచారం చేయడానికి వీల్లేదు.. భాజపాకు షాకిచ్చిన ఈసీ

ఆంగ్లేయుల నయవంచనకు మౌన సాక్ష్యం 'ఇండియా గేట్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.