జీహెచ్ఎంసీలో ఖాళీగా ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి... పురపాలక మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశారు. ఆహార పదార్థాల కల్తీ, రసాయనాలతో పండ్లను మాగబెడ్తున్నారని... వీటిని నిరోధించడానికి అవసరమైన పర్యవేక్షణ అధికారులు లేకపోవడం వల్ల ఈ దందా పెద్ద ఎత్తున సాగుతోందని ఆయన పేర్కొన్నారు. రసాయనాలను ఉపయోగించి పండ్లను పండించడం పట్ల హైకోర్టు తీవ్రంగా స్పందించినా ప్రభుత్వంలో ఎలాంటి స్పందనా లేదని ఆరోపించారు.
జీహెచ్ఎంసీలో కేవలం ముగ్గురు ఫుడ్ ఇన్స్పెక్టర్లతో నెట్టుకొస్తున్నారని, 20 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లను టీఎస్పీఎసీ ద్వారా ఎంపిక చేసినా... నేటికీ వాళ్లకు పోస్టింగులు ఇవ్వలేదనే విషయాన్ని పద్మనాభరెడ్డి గుర్తు చేశారు. కల్తీ పరీక్షలు నియంత్రించే మరో ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని, ఫుడ్ ఇన్స్పెక్టర్లను తొందరగా నియమించాలని మంత్రిని కోరారు.
ఇదీ చూడండి: 'ఐదారేళ్లలో ఆయుధ సంపత్తిలోనూ స్వయం సమృద్ధి'