ETV Bharat / city

Forum for Good Governance: ఆ విషయంపై గవర్నర్​కు ఫోరం ఫర్​ గుడ్​ గవర్నెన్స్​ కార్యదర్శి లేఖ.. - Forum For Good Governance

Forum for Good Governance: గవర్నర్‌ తమిళసై సౌందర్‌ రాజన్‌కు ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి పద్మనాభ రెడ్డి లేఖ రాశారు. రెరా ఏర్పాటు చేసి నాలుగేళ్లైనా ఛైర్మన్‌, సభ్యులను ఇంతవరకు నియమించలేదని.. అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయలేదని పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. ఈ రెండింటికి సబంధించి తక్షణమే చర్యలు తీసుకునేట్లు ప్రభుత్వాన్నిఆదేశించాలని లేఖలో కోరారు.

Forum For Good Governance Secretary Padmanabha Reddy Letter  To Governor

author img

By

Published : Feb 9, 2022, 8:01 PM IST

Forum for Good Governance: రాష్ట్రంలో స్థిరాస్థిరంగ నియమనిబంధనలు చట్టబద్దంగా అమలు చేసేందుకు ఏర్పాటైన రెరా పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి పద్మనాభ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్‌ తమిళసై సౌందర్‌ రాజన్‌కు లేఖ రాశారు. రెరా ఏర్పాటు చేసి నాలుగేళ్లైనా ఛైర్మన్‌, సభ్యులను ఇంతవరకు నియమించలేదని.. అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయలేదని పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. ఈ రెండింటికి సబంధించి తక్షణమే చర్యలు తీసుకునేట్లు ప్రభుత్వాన్నిఆదేశించాలని లేఖలో కోరారు.

ప్రధానంగా స్థిరాస్థి రంగంలో పారదర్శికత పెంచేందుకు ప్లాట్లు, ఇళ్ల అమ్మకాలపై జ‌వాబుదారీత‌నం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం స్థిరాస్థి చట్టం తెచ్చిందని గుర్తుచేశారు. ఆస్తుల కొనుగోలుదారులు మోస‌పోకుండా ఉండేందుకు, వివాదాలు ఏవైనా త‌లెత్తిన‌ప్పుడు మ‌ధ్యవ‌ర్తిత్వం వహించి త్వరగా పరిష్కరించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. రెరాకు స్థిరాస్థిలో అపారమైన అనుభవమున్న ఒక అధ్యక్షుడిని, ఇద్దరు సభ్యులను నియమించాల్సి ఉందని... అది జరిగే వరకు రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శి స్థాయి ర్యాంకు అధికారిని రెగ్యులేటరీ అధికారిగా నియమించొచ్చని ఆయన వివరించారు.

2018 జనవరిలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి రాజేష్ తివారీని రెగ్యులేట‌రీ అథారిటీగా నియ‌మించింది. ఆ తరువాత ఇప్పటి వరకు అధ్యక్షుడి, సభ్యుల నియామకం జరగలేదని పేర్కొన్నారు. స్థిరాస్థి చట్టంలోని సెక్షన్ 43 (1) ప్రకారం చ‌ట్టం అమ‌లులోనికి వ‌చ్చిన ఏడాది లోపు అప్పిలేట్ ట్రిబ్యున‌ల్‌ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. కాని ఇవన్నీకాగితాలకే పరిమితమయ్యాయని, దీంతో చట్టం లక్ష్యం నెరవేరడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను గమనిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం అక్రమ బిల్డర్లకు కొమ్ము కాస్తున్నట్లు అనుమానం క‌లుగుతుందన్నారు. కొంతమంది బిల్డర్లు, ఏజంట్లు రెరాలో రిజిస్ట్రేషన్లు చేసుకోకుండానే పెద్ద ఎత్తున అమ్మకాలు జరుపుతూ...సామాన్యులను మోసాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.