జీహెచ్‌ఎంసీ ముసాయిదా బిల్లుపై ప్రభుత్వం ప్రజల సలహాలు సూచనలు తీసుకోవాలని మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ను సుపరిపాలన వేదిక కోరింది. మహానగర్ పాలక సంస్థ కొత్తగా తయారు చేస్తున్న ముసాయిదా బల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు తగు సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. గతంలోనే ఈ బిల్లుపై సలహాలు సూచనలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.
జీహెచ్‌ఎంసీ చట్టం 1.2 కోట్ల ప్రజల దైనందిన అవసరాలతో ముడిపడి ఉందని... గత ఐదారు సంవత్సరాల్లో నగర పాలక సంస్థ పౌర సేవలను విస్మరించిందన్నారు. కొత్త చట్టం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న జీహెచ్‌ఎంసీకి పరిష్కారం చూపాలని పద్మనాభరెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన మంత్రి కేటీఆర్‌కు వినతి పత్రం సమర్పించారు.
ఇదీ చూడండి : నత్తనడకన రిజిస్ట్రేషన్లు... అవగాహన లేమే అసలు సమస్య...