ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయంలో పిక్అప్, డ్రాపింగ్కు డబ్బులు వసూలు చేయడంపై మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడు శ్రీ రాజ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల వద్ద కొత్త తరహా వసూళ్లు ఎందుకు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీరాజ్కు అక్కడ ఉన్న మరికొంతమంది వ్యక్తులు మద్దతు తెలిపారు. ఓ సీఆర్పీఎఫ్ అధికారి వచ్చి... ఇలా వసూలు చేయడంపై వివరణ ఇవ్వాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇలాంటి వసూళ్లను ప్రోత్సహించొద్దని అక్కడి వారందరికీ చెప్పిన హర్ష కుమార్ కుమారుడు శ్రీ రాజ్.. వందకుపైగా కారులను ఉచితంగాలోనికి పంపించారు.
ఇదీ చదవండి: పది రూపాయల కోసం ప్రాణాలు తీశాడు..