అటవీశాఖలో నలుగురిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగజ్ నగర్ అటవీ డివిజనల్ అధికారి రాజా రమణా రెడ్డిపై బదిలీ వేటు పడింది. రాజా రమణా రెడ్డిని అటవీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ కార్యాలయంలో విజిలెన్స్ ఎఫ్డీఓగా బదిలీ చేస్తున్నట్లు సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగజ్ నగర్ ఎఫ్డీఓగా ఎం.విజయ్ కుమార్ ను నియమించింది. పాల్వంచ ఎఫ్డీఓగా వి.తిరుమల్ రావు, వరంగల్ అటవీ జెనెటిసిస్ట్గా ఎస్.సుజాత నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చూడండి: మద్యం దుకాణాల ఏర్పాటుకు నోటిఫికేషన్లు విడుదల