ETV Bharat / city

'హెచ్చరిక.. కాలువలో మొసళ్లు తిరుతున్నాయ్.. లోనికి దిగకండి' - prakasam updates

ఏపీలోని నాగార్జునసాగర్ దర్శి బ్రాంచి కాలువలో 4 మొసళ్లు తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే సాగర్ కాలువలోని పలు ప్రాంతాల్లో మొసళ్లు కనిపించాయి. అధికారులు హెచ్చరిక బోర్డులను కెనాల్ సరిహద్దుల్లో ఏర్పాటు చేశారు.

'హెచ్చరిక.. కాలువలో మొసళ్లు తిరుతున్నాయ్.. లోనికి దిగకండి'

author img

By

Published : Nov 25, 2020, 3:32 PM IST

ఏపీలోని ప్రకాశం జిల్లా దర్శిలోని నాగార్జున సాగర్ బ్రాంచి కాలువలో 4 మొసళ్లు తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఓసారి కురిచేడు మండలం బయ్యారం వద్ద ఓ రైతుకు మొసలి కనిపించగా.. స్థానికులు ఆందోళన చెందారు. ఆ తర్వాత కూడా సాగర్ కాలువలో పలు ప్రాంతాల్లో స్థానికులకు మొసళ్లు కనిపించాయి. ఈ వివరాలపై ఆరా తీసిన అటవీ శాఖ అధికారులు 4 మొసళ్లు సంచరిస్తున్నట్లు తేల్చారు. కాలువపై హెచ్చరిక బోర్డులును ఏర్పాటు చేశారు.

దర్శి, కురిచేడు మండలాల ప్రజలు కాలువలోకి దిగరాదని అటవీ శాఖాధికారి తులసీరావు తెలిపారు. అయ్యప్ప, భవాని, శివ, వెంకటేశ్వర మాలలు ధరించిన భక్తులు కాలువలో స్నానాలు చేయరాదని దండోరా వేయించారు. గొర్ల కాపరులు, గేదెల కాపరులు సైతం సాగర్ కాలువలో దిగరాదని, వ్యవసాయ కూలీలు కూడా... కాలువలో ఎటువంటి కార్యకలాపాలు చేయకూడదని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు తులసీరావు తెలిపారు.

'హెచ్చరిక.. కాలువలో మొసళ్లు తిరుతున్నాయ్.. లోనికి దిగకండి'

ఇదీ చదవండి: నివర్​ ఎఫెక్ట్: 26 విమాన, 5 రైలు సర్వీసులు రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.