ETV Bharat / city

పునాదులు కదిలాయ్‌.. భవనాలు బలహీనపడ్డాయ్

భాగ్యనగరంలో వరదల ప్రభావానికి 5 శాతం భవనాలు బలహీనపడ్డాయి. మిగతా 95 శాతం నిర్మాణాలు పదిలంగా ఉన్నాయని, వాటి పటిష్ఠత విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని జీహెచ్‌ఎంసీ సర్వే స్పష్టం చేసింది.

floods effect on Hyderabad
హైదరాబాద్​పై వరద ప్రభావం
author img

By

Published : Nov 3, 2020, 1:45 PM IST

రోజుల తరబడి ముంపులో ఉండడంతో ప్రహరీలూ దెబ్బతిన్నాయి. పలుచోట్ల వరద ప్రవాహం పునాదులను ఢీకొట్టింది. 5 శాతం ఇళ్లు వేర్వేరు విధాలుగా దెబ్బతిన్నాయి. సమస్య ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో విధంగా ఉంది. ప్రభావిత భవనాలకు జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసింది. సంబంధిత యజమానులు, వెంటనే చర్యలు ప్రారంభించాల్సిన అవసరముందని గుర్తుచేసింది.

నోటీసుల ఇచ్చిన కొన్ని నిర్మాణాలు

  • చైతన్యపురి పుల్లారెడ్డి మిఠాయి దుకాణం వెనుకనున్న రెండంతస్తుల నిర్మాణం పునాది వరద ప్రవాహానికి పూర్తిగా దెబ్బతింది. కూల్చివేయాలని నోటీసు ఇవ్వగా, యజమాని అంగీకరించారని బల్దియా తెలిపింది. సమీపంలోని స్వయంవర్‌ షోరూం పక్కన, వెనుకనున్న రెండు జి+3 భవనాలూ పాక్షికంగా దెబ్బతిన్నాయి. జాగ్రత్త చర్యలతో వాటి ప్రహరీని తిరిగి నిర్మించాలంటూ, భవనం గోడలకూ మరమ్మతులు చేసుకోవాలని సూచించారు.
  • కోదండరామ్‌నగర్‌లోని ఎం.జగన్‌మోహన్‌శర్మ ఇంటి ప్రహరీ వరద ప్రవాహంతో దెబ్బతినగా, పునర్నిర్మించుకోవాలని బల్దియా సూచించింది. ఇంటికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు.
  • తిరుమల్‌నగర్‌లో గతంలో శారద థియేటర్‌ వెనుకనున్న భవనం రోడ్డు కంటే దిగువన ఉంది. ఎక్కువ రోజులు ముంపులో ఉండటంతో ప్రహరీని పునర్నిర్మించుకోవాలని, నిర్మాణానికి మరమ్మతులు చేసుకోవాలని ఇంజినీర్లు స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో పలు ఇతర భవనాల ప్రహరీలను కూల్చి కొత్తగా కట్టుకోవాలని సూచించారు.
  • చైతన్యపురి ప్రధాన రోడ్డులోని అన్నపూర్ణ షాపింగ్‌ మాల్‌ భవనం చాలా రోజులపాటు నీటిలో ఉన్నందున నిర్మాణానికి మరమ్మతులు అవసరమయ్యాయి.

ముంపుతో ఆందోళన..

ప్రభుత్వం వారం క్రితం వరద ప్రభావిత ప్రాంతాల్లో నిర్మాణాల పటిష్టతపై సర్వే చేయాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. ఆ మేరకు ఇంజినీర్లు రంగంలోకి దిగారు. టోలిచౌకీలోని నదీంకాలనీ, చార్మినార్‌ జోన్‌లోని హఫీజ్‌బాబానగర్‌తోపాటు చుట్టు పక్కల ప్రాంతాలు, హయత్‌నగర్‌లోని బంజారాకాలనీ, మల్కాజిగిరి బండచెరువు దిగువ ప్రాంతాలను, సరూర్‌నగర్‌ చెరువు బాధిత కాలనీల్లోని ఇళ్లను పరిశీలించారు. అధ్యయనం పూర్తయ్యాక యజమానులకు నోటీసులు ఇస్తున్నారు.

ఒక్కో చోట.. ఒక్కో సమస్య..

రాజేంద్రనగర్‌, చాంద్రాయణగుట్ట, అలీకాలనీ, హఫీజ్‌బాబానగర్‌ తదితర ప్రాంతాల్లో వరద చాలా రోజులపాటు నిలిచింది. అయినప్పటికీ అక్కడున్న ఇళ్లకు, వాణిజ్య భవనాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. సరూర్‌నగర్‌ ప్రాంతంలో కొన్ని నిర్మాణాల పునాదులు, మరికొన్నింటి ప్రహరీలు దెబ్బతిన్నాయని; మల్కాజిగిరిలో ఎన్‌ఎండీకాలనీ, షిర్డీసాయినగర్‌, చంద్రబాబునగర్‌ తదితర కాలనీల్లో చాలా ప్రహరీలు కొట్టుకుపోయాయని, మిగిలిన వాటినీ తొలగించి కొత్తగా నిర్మించుకోవాలనే సూచన చేసినట్లు అధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.