ETV Bharat / city

Flood water problem: ఈ వరదనీరు పోయే మార్గం ఎట్లా..? - నగరంలో వానలు

Flood water problem: గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని నాగోల్ పరిసర కాలనీలు ముంపునకు గురయ్యాయి. వర్షం నీరు సక్రమంగా వెళ్లేందుకు నాలాలు సరిగా లేకపోవడంతో వరద నీరంతా ఎక్కడికక్కడ నిలిచిపోయి, కాలనీల్లోకి ప్రవేశిస్తోంది.

rain water
వరద నీరు
author img

By

Published : Sep 30, 2022, 3:48 PM IST

Flood water problem: హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజవర్గంలోని నాగోల్ డివిజన్​లో పలు కాలనీలు గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు నీటమునిగాయి. నాగోల్​లోని సాయిరామ్ నగర్, వెంకటరమణనగర్, బీఎన్ రెడ్డి, పద్మావతి కాలనీల్లోని రహదారులు ఇప్పుడు వరదనీటిలోనే ఉన్నాయి. ఇక్కడ వర్షపు నీరు బండ్లగూడ చెరువులోకి వెళ్లాలి. అక్కడ నుంచి నాగోల్ చెరువులోకి ఈ వరద నీరు మొత్తం వెళుతోంది. అది కూడా నిండిన అనంతరం నాలాల ద్వారా కిలోమీటర్ దూరంలో ఉన్న మూసీ నదిలో కలుస్తోంది.

నీట మునిగిన నాగోల్​ పరిసర ప్రాంతాలు

కానీ సరైన నాలా సదుపాయం లేకపోవడంతో వరద నీరు ఎక్కువై డ్రైనేజీ ద్వారా వచ్చి బయటకి పొంగుతుండటంతో రోడ్లన్నీ జలమయం అయ్యి, మురికినీరు చేరడం వల్ల దుర్గంధం భరితమైన వాసనను వెదజల్లుతూ కాలనీవాసులకు సమస్యగా మారుతోంది. దీనితో ఈ కాలనీల్లో భారీవర్షాలు పడ్డ ప్రతిసారీ ఇదే సమస్య వస్తోందని స్థానికులు వాపోయారు. వెంటనే సరైన నాలా ఏర్పాటు చేసి ఈ కాలనీలను వరద ముంపు నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.