ETV Bharat / city

జంట జలాశయాలకు తగ్గిన ఉద్ధృతి.. శాంతించిన మూసీ

author img

By

Published : Jul 28, 2022, 1:01 PM IST

Twin Reservoirs Flow reduced: హైదరాబాద్‌లో జంట జలాశయాలకు వరద ఉద్ధతి తగ్గుతోంది. ఉస్మాన్‌సాగర్ జలాశయం 10 గేట్లు.. హిమాయత్‌సాగర్ ఒక గేట్ తెరిచి మూసీలోకి నీటిని వదులుతున్నారు.

Twin Reservoirs Flow reduced
Twin Reservoirs Flow reduced
జంట జలాశయాలకు తగ్గిన ఉద్ధృతి

Twin Reservoirs Flow reduced : జంట జలాశయాలకు వరద ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. ఉస్మాన్ సాగర్​లోకి 3వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, హిమాయత్ సాగర్ కు 400 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా..... 1787 అడుగులకు చేరింది. దీంతో అధికారులు పది గేట్ల ద్వారా మూసీలోకి 6వేల 90 క్యుసెక్కుల నీటిని వదులుతున్నారు.

మరోవైపు హిమాయత్ సాగర్ కి ఇన్ ఫ్లో భారీగా తగ్గుతున్నట్టు అధికారులు ప్రకటించారు. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1763 అడుగులు కాగా... ఇప్పటికే 1760 అడుగులకు చేరింది. దీంతో హిమాయత్ సాగర్ ఒకగేట్ ద్వారా మూసీలోకి 330 క్యూసెక్కుల నీటిని వదలుతున్నట్టు పేర్కొన్నారు.

నిన్న జంట జలాశయాలకు వరద ఉద్ధృతి పెరగడం వల్ల మూసీ ఉగ్రరూపం దాల్చింది. భారీ వరదలతో మూసీ చుట్టుపక్కల బస్తీలు, కాలనీల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. స్థానికులను జీహెచ్‌ఎంసీ, పోలీసులు ఎక్కడికక్కడ అప్రమత్తం చేశారు. చాదర్‌ఘాట్‌, మూసారంబాగ్‌ వంతెనలు, హిమాయత్‌నగర్‌, మంచిరేవుల కాలినడక వంతెనలపై నుంచి వరద పొంగడంతో కొన్ని గంటలపాటు రాకపోకలను నిలిపివేసి, ప్రవాహం తగ్గాక పునరుద్ధరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.