ఆంధ్రప్రదేశ్లోని విశాఖ విమానాశ్రయం నుంచి నవంబర్ నెలలో 1,39,685 మంది రాకపోకలు సాగించినట్లు డైరెక్టర్ రాజకిషోర్ తెలిపారు. అక్టోబరులో పోల్చితే 16 శాతం ప్రయాణికుల వృద్ధి కనిపించినట్లు చెప్పారు.
మరోవైపు విమాన సర్వీసులు 14 శాతం పెరిగాయన్నారు. డిసెంబరులో మరింత వృద్ధి ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
నవంబర్ గణాంకాలు
విమాన సర్వీసులు | ప్రయాణికులు | |
దేశీయ | 1175 | 67,344(రాక) 71,628(పోక) |
అంతర్జాతీయ | 8 | 689(రాక) 24(పోక) |
ఇవీ చదవండి: కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్ల మధ్య వివాదం