ETV Bharat / city

కరోనాతో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

కొడుకులు, కోడళ్లు, కూతుళ్లతో ఆ ఇల్లు కళకళలాడేది. అలాంటి పచ్చని అనుబంధాల లోగిలిలో... కరోనా పెను ఉత్పాతం సృష్టించింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురిని కబళించింది. కేవలం 20 రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు విగత జీవులయ్యారు. కనీవినీ ఎరుగని రీతిలో కుటుంబం ఛిన్నాభిన్నం కాగా... మిగిలిన వారి గుండెకోత వర్ణనాతీతంగా మారింది.

five family members Died Due To Corona at guntur
ఒకే కుటుంబంలో కరోనాతో ఐదుగురు మృతి
author img

By

Published : May 11, 2021, 9:02 AM IST

కరోనా మహమ్మారి ఏపీలోని గుంటూరు నగరంలో నివసించే ఓ కుటుంబంలో కల్లోలం సృష్టించింది. 20 రోజుల వ్యవధిలో ఐదుగురిని బలి తీసుకోగా... ఆ కుటుంబంలో మిగిలినవారు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేసిన మహ్మద్ ఫరుద్దీన్ షా... కుటుంబంతో సహా ఏ.టీ అగ్రహారంలోని శ్రీరామనగర్‌లో నివసించేవారు. కుమార్తె, ఇద్దరు కుమారులకు వివాహాలు చేశారు. ఉన్నంతలో కలిసిమెలసి సంతోషంగా జీవించే ఆ కుటుంబాన్ని.. కరోనా కోలుకోలేని రీతిలో దెబ్బతీసింది.

ఒకే కుటుంబంలో కరోనాతో ఐదుగురు మృతి

గత నెల 4వ తేదీ నుంచి 29 మధ్య ఫరుద్దీన్‌తోపాటు ఆయన కుమార్తె, తల్లి, కుమారుడు, భార్య వరుసగా అసువులు బాశారు. మరణించిన ఏ ఒక్కరూ మరొకరి మృతి గురించి తెలియకుండానే కన్నుమూయడం... ఆ కుటుంబ దుస్థితికి నిదర్శనం. చికిత్స పొందుతున్న సమయంలో చెబితే మరింత ప్రమాదమని... వారికి విషయం తెలియజేయలేదు.

ప్రస్తుతం ఫరుద్దీన్ చిన్న కుమారుడు జిలానీ కుటుంబం, వదిన గౌసియా, ఆమె పిల్లలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. పచ్చని కుటుంబంలో కరోనా సృష్టించిన ఉత్పాతం నుంచి కోలుకోవడం వారికి శక్తికి మించిన పనిగా మారింది. వైద్య ఖర్చుల కోసం రూ. 20 లక్షల వరకూ అప్పు చేశారు. పుట్టెడు కష్టంలో ఉన్న తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: ఆగని పెట్రో బాదుడు- మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.