ETV Bharat / city

ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా చేప, రొయ్య పిల్లల పంపిణీ ప్రారంభం

రాష్ట్రంలో నాలుగో విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం... ఈ నెల 6 నుంచి ప్రారంభం కానుంది. పుష్కలమైన వర్షాలు కురుస్తుండటం వల్ల... ప్రధాన జలాశయాలు సహా చెరువులు, ఇతర నీటి వనరుల్లో చేప పిల్లలు, రొయ్య పిల్లలు వదిలేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తొలి రోజు నాగర్‌కర్నూలు జిల్లాలో పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు.

author img

By

Published : Aug 4, 2020, 8:56 PM IST

fish and prawns distribution in state wide on august 6th
ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా చేప, రొయ్య పిల్లల పంపిణీ ప్రారంభం

రాష్ట్రంలో 4వ విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్నది. 74 ప్రధాన జలాశయాలు, 24 వేల చెరువులు, ఇతర నీటి వనరుల్లో... రూ.50 కోట్ల వ్యయంతో 81 కోట్ల చేప పిల్లలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా రూ. 10 కోట్ల ఖర్చుతో 5 కోట్ల రొయ్య పిల్లలు విడుదలకు రంగం సిద్ధం చేసింది. తొలిరోజు నాగర్​కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెంలోని పెంటాని చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమానికి... పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే పాల్గొనున్నారు.

మొదటగా ఈ నెల 5న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉన్నందున మరుసటి రోజుకు వాయిదా వేశారు. అదే రోజు మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్ మండలం మడిగట్లలోని మడికాని చెరువు, కోడూరులో మైసమ్మ చెరువులో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డితో కలిసి ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేప పిల్లలు విడుదల చేస్తారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్​నగర్ మండలం కమ్మదనం గ్రామంలో వెంకాయకుంట చెరువులో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేస్తారు.

చేప, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతూ... ఇప్పటికే మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లకు వ్యక్తిగతంగా స్వయంగా లేఖలు రాసినట్లు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. రాష్ట్రంలో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్య సహకార సొసైటీ సభ్యులు పాల్గొనేలా మత్స్యశాఖ చర్యలు తీసుకుంటుంది. కరోనా నేపథ్యంలో చేప పిల్లల విడుదల సమయంలో 25 మందికి మించి లేకుండా జాగ్రత్తలు సహా... శానిటైజర్లు, మాస్క్‌లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,286 మందికి కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.