ETV Bharat / city

నెల్లూరు వ్యక్తికి కరోనా పాజిటివ్.. ఏపీ యంత్రాంగం అప్రమత్తం..

రాష్ట్రంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. నెల్లూరుకు చెందిన వ్యక్తికి కరోనా వైరస్​ (కొవిడ్​-19) సోకినట్లు కలెక్టర్​ తెలిపారు. బాధితుడికి జీజీహెచ్​ ఐసోలేషన్​ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ముందు జాగ్రత్తగా.. నగరంలోని సినిమా హాళ్లను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

first positive carona case detected in nellore anshrapradesh
నెల్లూరు వ్యక్తికి కరోనా పాజిటివ్.. యంత్రాంగం అప్రమత్తం
author img

By

Published : Mar 12, 2020, 9:19 PM IST

Updated : Mar 12, 2020, 10:29 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తికి కరోనా వైరస్ (కొవిడ్‌-19) సోకినట్లు నిర్ధరణ అయినట్టు కలెక్టర్‌ ధ్రువీకరించారు. కరోనా అనుమానంతో ఓ యువకుడు జీజీహెచ్‌లో నిన్న చేరిన విషయం తెలిసిందే. అతను ఇటీవలే ఇటలీ నుంచి వచ్చాడు. అతని నమూనాలను మొదట తిరుపతి స్విమ్స్‌లో పరీక్షించి కరోనా సోకినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం పూర్తిస్థాయి పరీక్షల కోసం నమూనాలను పుణె పంపగా అక్కడ పాజిటివ్‌గా తేలినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బాధితుడిని నెల్లూరు జీజీహెచ్‌ ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా బాధితుడి కుటుంబ సభ్యుల నమూనాలను పరీక్షించగా నెగటివ్‌ వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.

నెల్లూరు వ్యక్తికి కరోనా పాజిటివ్.. ఏపీ యంత్రాంగం అప్రమత్తం..

మరో మహిళకు.. చికిత్స

మరోవైపు.. కరోనా వైరస్‌ అనుమానంతో మరో మహిళ నెల్లూరు జీజీహెచ్‌లో చేరింది. ఆమెకు ఐసోలేషన్‌ వార్డులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సదరు మహిళ ఇటీవల కువైట్‌ వెళ్లి వచ్చినట్లు సమాచారం. ఆమె నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షల కోసం పుణె పంపించినట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికే చేరిన 65 ఏళ్ల వృద్ధురాలికి వ్యాధి లేదని వైద్యులు నిర్ధరించారు.

సినిమా హాళ్ల మూసివేత

కరోనా కేసు నమోదైన కొద్ది గంటల్లోనే మరికొద్ది మందిని అధికారులు గుర్తించారు. నగరంలోని ఓ పరిశ్రమలో పనిచేసేందుకు పోర్చుగల్​ నుంచి 20 మందికి పైగా వ్యక్తులు వచ్చి హోటల్​లో బస చేశారు. వీరికి వైరస్ సోకిందేమోనని హోటల్ సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. స్పందించిన అధికారులు పరీక్షలు పూర్తయ్యే వరకు హోటల్​ వీడి వెళ్లొద్దని సూచించారు. అంతే కాకుండా కరోనా దృష్ట్యా నగరంలోని సినిమా హాళ్లను మూసివేయాలని కలెక్టర్​ ఆదేశించారు.

ఇదీ చదవండి:

కరోనా రాకుండా ఏం చేయాలో చూడండి..!

Last Updated : Mar 12, 2020, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.