ETV Bharat / city

రిజిస్ట్రేషన్లకు అమావాస్య దెబ్బ... తొలిరోజు వందలోపే... - రిజిస్ట్రేషన్లకు అమావాస్య దెబ్బ... తొలిరోజు వందలోపే...

రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మొదటి రోజు సాఫీగా జరిగాయి. 40 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 82 రిజిస్ట్రేషన్లు జరిగాయి. సోమవారానికి 107 స్లాట్లు బుక్ చేసుకున్నా... సంబంధింత వ్యక్తులు రాకపోవడం, ఇతర కారణాల వల్ల కొన్ని రిజిస్ట్రేషన్లు జరగలేదు. రెండో రోజు కోసం 58 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 155 రిజిస్ట్రేషన్​ స్లాట్లు బుక్​ చేసుకున్నారని సీఎస్​ తెలిపారు.

first day non agricultural lands registrations in Dharani portal

author img

By

Published : Dec 15, 2020, 4:23 AM IST

Updated : Dec 15, 2020, 4:47 AM IST

రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు 40 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 82 రిజిస్ట్రేషన్లు జరిగాయి. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం సోమవారానికి 107 స్లాట్లు బుక్ చేసుకున్నా... సంబంధింత వ్యక్తులు రాకపోవడం, ఇతర కారణాల వల్ల కొన్ని రిజిస్ట్రేషన్లు జరగలేదు. ఏడురకాల రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇవ్వగా అమ్మకం ( సేల్ డీడ్, రిజిస్ట్రేషనే ఎక్కువగా జరిగాయి. సోమవారం అమావాస్య కావడంతో తక్కువ మందే ప్లాట్లు బుక్ చేసుకున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రకారం నిజామాబాద్, ఖమ్మం జిల్లాలో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా 40 కార్యాలయాల పరిధిలోనే రిజిస్ట్రేషన్లు జరిగాయి.

రంగారెడ్డి జిల్లా కాకుండా ఇతర జిల్లాలను పరిశీలిస్తే ఆదిలాబాద్ జిల్లాలోనే ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. కొన్ని చోట్ల సర్వర్ సమస్యలలో కొంత జాప్యల జరిగినా చివరకు పూర్తయ్యాయి. రికార్డులో పేరు మార్పు (మ్యుటేషన్ కూడా వెంటవెంటనే పూర్తిచేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాగానే డాక్యుమెంట్, ఈ పాస్ పుస్తకాన్ని కొనుగోలుదారులకు అందజేశారు. హైదరాబాద్ అజంపురాలో ఉదయం 10: 45 గంటల స్లాట్ ఇవ్వగా సర్వర్ సమస్య ఏర్పడడంతో ఒంటిగంటకు రిజిస్ట్రేషన్ పూర్తయింది. వరంగల్ అర్బన్ జిల్లాలో సబ్​రిజిస్ట్రార్ కార్యాలయంలో నాలుగు స్లాట్లు నమోదు కాగా ఒక సేల్‌డీడ్, ఒక మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ పూర్తయ్యాయి. సంబంధిత వ్యక్తి రాని కారణంగా ఒకటి, వేలి ముద్రలను కంప్యూటర్ స్వీకరించక పోవడంతో మరో రిజిస్ట్రేషన్ జరగలేదు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఆస్తుల వివరాలు రిజిస్ట్రేషన వెబ్ సైట్ కు అనుసంధానం కాకపోవడంతో షాట్లు బుక్ కావడంలేదు. దీనిపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కొనుగోలుదారు డబ్బును ఏ రూపంలో చెల్లించారనే వివరాల నమోదుకు అవకాశం ఉండాలని రిజస్ట్రేషన్ చేసుకున్న వారు కొందరు సూచించారు. లింక్ డాక్యుమెంట్లను పరిశీలించేలా ఉండాలని మరికొందరు సూచిస్తున్నారు.

ఖాళీ స్థలాలకు ఎప్పుడు?

తొలిరోజునే భారీ స్థలాల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించలేదు. నిజానికి రిజిస్ట్రేషన్లలో అత్యధికం ఇలాంటివే ఉంటాయి. వీటికి అవకాశం ఇస్తే రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్లాట్లకు కూడా వెంటనే అవకాశం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. స్లాట్ బుకింగ్ పడే సమస్యలు వస్తున్నాయని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగేచోట ఒకటి రెండు రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. అత్యదిక సేవలకు స్లాట్ బుక్ కావడంలేదని అభిప్రాయపడ్డారు.

రిజిస్ట్రేషన్ సంఖ్యపై స్పష్టత అవసరం

రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ప్రతి సంవత్సరం ఆ సల్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో జనవరి ఒకటో తేదీన ఒకటో నంబరుతో ప్రారంభించి డిసెంబరు 31 వరకు వరుస సంఖ్యను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కు ఇస్తారు. ఈ ఏడాది కూడా సబ్ రిజిస్ట్రార్ ఆపీసుల పరిధిలో జనవరి 1 నుంచి సెప్టెంబరు ఏదో తేదీ (రిజిస్ట్రేషన్ల నిలుపుదలకు ముందు రోజు) వరకు రిజిస్ట్రేషన్ సంఖ్యను అలాగే ఇచ్చారు. ప్రస్తుతం కొత్త విధానంలో సోమవారం నుంచి ప్రారంభమైన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంఖ్య మళ్లీ ఒకటి నుంచి ప్రారంభమైంది. ఇలాగైతే ఒకే ఏడాది వేర్వేరు డాక్యుమెంట్లకు ఒకే నంబరు వచ్చే అవకాశం ఉంటుందని, దీనిపై స్పష్టత అవసరమని రిజిస్ట్రారు అభిప్రాయపడ్డారు.

డాక్యుమెంట్ రైటర్ల నిరసన

పూర్వపు విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్​తో రాష్ట్రంలో పలుచోట్ల డాక్యుమెంట్ రైటర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కార్డు విధానంలో గతంలో ఉన్న పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని కోరుతున్నారు. సులభంగా ఉందన్న సబ్ రిజిస్ట్రార్లు స్లాట్ బుక్ అయిన వాటి రిజిస్ట్రేషన్‌కు సమస్యలు రావడం లేదని స రివస్తారు. కొందరు ఆభిప్రాయపడ్డారు. పురపాలక ఆస్తి పన్ను రికార్డులు కూడా అనుసంధానం కావడంతో ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య(పీటీఎన్)ను నమోదు చేయగానే వివరాలన్నీ వస్తున్నాయని... రికార్డులు ఆన్​లైన్లో అనుసంధానం కావటం వల్ల సులభంగా రిజిస్ట్రేషన్ పూర్తి అవుతోందన్నారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యుటేషన్ చేసి రిజిస్టర్ పత్రాలు, ఈ-పాస్ పుస్తకం చేస్తుండటం వల్ల కొనుగోలుదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

తొలిరోజు సాఫీగా రిజిస్ట్రేషన్లు: సీఎస్

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాఫీగా సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్ తెలిపారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవన్నారు. ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకున్న రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతాయన్నారు. ఈ మేరకర్​ సీఎస్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కొందరు స్లాట్ బుక్ చేసుకోకుండా నేరుగా సబ్​రిజిస్ట్రార్ కార్యాలయాలకు వస్తున్నారన్నారు. ఎక్కడ నుంచైనా స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. స్లాట్ బుక్ చేసుకుని నిర్దేశించిన సమయానికి వచ్చి కాలయాపన లేకుండా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించారు. రెండోరోజు మంగళవారానికి 58 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 155 రిజిస్ట్రేషన్​ స్లాట్లు బుక్​ చేసుకున్నారని సీఎస్​ తెలిపారు.

ఇదీ చూడండి: యుద్ధ ప్రాతిపదికన టీ-ఫైబర్ ప్రాజెక్టు

Last Updated : Dec 15, 2020, 4:47 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.