ETV Bharat / city

కొవిడ్​ కేర్ సెంటర్​లో అగ్నిప్రమాదం... ఏడుగురు మృతి

ఏపీలోని విజయవాడలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటనతో కరోనా రోగులు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నారు.

fire-accident-in-vijayawada-covid-care-center-swarna-palous
కొవిడ్​ కేర్ సెంటర్​లో అగ్నిప్రమాదం... ఏడుగురు మృతి
author img

By

Published : Aug 9, 2020, 8:33 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ స్వర్ణ ప్యాలెస్​లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. కొవిడ్ కేర్ సెంటర్​గా చికిత్స అందిస్తున్న ఈ ప్యాలెస్​లో పొగలు దట్టంగా అలుముకొని... శ్వాస తీసుకోవడంలో బాధితులు ఇబ్బందులు పడ్డారు. కిటికీల్లోంచి కేకలు వేసిన దృశ్యాలు ఆందోళన రేపాయి.

కొవిడ్​ కేర్ సెంటర్​లో అగ్నిప్రమాదం... ఏడుగురు మృతి

సకాలంలో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం లోపల చిక్కుకున్న వారిని... బయటకు తీసుకొచ్చి ఆంబులెన్సుల ద్వారా.. లబ్బీపేటలోని రమేశ్‌ ఆస్పత్రికి చెందిన మరో సెంటర్‌కు తరలిస్తున్నారు.

ప్యాలెస్​లో 30 మంది వరకు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుండగా... 10 మంది సిబ్బంది వారికి వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందారు. షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయని సీపీ శ్రీనివాసులు తెలిపారు. ఎన్డీఆర్ ఎఫ్ బృందం సహాయ చర్యల్లో పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.