కంచరపాలెం కొత్త రైల్వే కోచింగ్ కాంప్లెక్స్ సమీపంలో రైల్వే బోగీల్లోని కొన్ని వ్యర్ధ పరికరాలు ఒకచోట కుప్పగా పోసి ఉంచారు. శుక్రవారం మధ్యాహ్నం వాటికి నిప్పు అంటుకుంది. క్రమంగా మంటలు ఎగిసిపడ్డాయి. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సరైన సమయంలో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు పెద్దగా చెలరేగకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.
ఇదీ చదవండి: గుడ్న్యూస్: ఆగస్టు 15 కల్లా మార్కెట్లోకి కోవాగ్జిన్!