ETV Bharat / city

గుంటూరు జీజీహెచ్‌లో అగ్నిప్రమాదం

ఏపీలోని గుంటూరు నగరంలోని జీజీహెచ్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని కొవిడ్ రోగులను ఉంచే ఐసీయూ‌ వార్డులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అగ్నిప్రమాదం సమయంలో 15మంది కరోనా రోగులు, ఐదుగురు డయాలసిస్‌ రోగులు ఉన్నారు.

guntur ggh taja
గుంటూరు జీజీహెచ్‌లో అగ్నిప్రమాదం
author img

By

Published : Jan 7, 2021, 2:11 AM IST

ఏపీలోని గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రి(జీజీహెచ్)లో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్​తో కొవిడ్ రోగులుండే రెండో అంతస్తులోని ఐసీయూ వార్డులో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం సమయంలో మూడు వేర్వేరు వార్డుల్లో 15మంది కొవిడ్ రోగులు, ఐదుగురు డయాలసిస్ రోగులు చికిత్స పొందుతున్నారు. సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. రోగులను హుఠాహుఠిన వేరే వార్డులకు తరలించారు. ఆక్సిజన్ పైపులు మాడిపోగా... వెంటనే వేరే వార్డులోకి చేర్చి ఆక్సిజన్ సరఫరాను పునరుద్ధరించారు.

ఘటనా స్థలిని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, ఎమ్మెల్యే షేక్ ముస్తఫా, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి పరిశీలించారు. రోగులంతా సురక్షితంగా ఉన్నారని, సిబ్బంది సకాలంలో స్పందించారని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.

గుంటూరు జీజీహెచ్‌లో అగ్నిప్రమాదం

భారీ ప్రమాదం తప్పింది

మంటలు వచ్చిన వెంటనే సిబ్బంది స్పందించి అదుపు చేశారు. అలాగే ఆక్సిజన్​ సరఫరాను నిలిపివేశారు. లేదంటే మంటలకు ఆక్సిజన్​ తోడై ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. మరోవైపు ప్రమాదం జరిగిన వార్డులోని రోగులను త్వరితగతిన ఇతర వార్డులకు తరలించి చికిత్స అందించాం- డాక్టర్ ప్రభావతి, జీజీహెచ్ సూపరింటెండెంట్

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన అగ్నిమాపక పరికరం ద్వారా మంటలను ఆపిన నాట్కో క్యాన్సర్ ఆస్పత్రి పొరుగు సేవల ఉద్యోగి అవినాష్​ను, మిగతా సెక్యూరిటీ సిబ్బందిని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి అభినందించారు.

ఇదీ చూడండి: పంచుకుంటున్నారా.. తెంచుకుంటున్నారా!?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.