Award For Priya Foods : నాణ్యమైన ఆహార ఉత్పత్తుల ఎగుమతులతో దేశానికి విదేశీ మారక ద్రవ్యం వచ్చేందుకు విశేష కృషి చేస్తున్న ‘ప్రియా ఫుడ్స్’కు ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక ‘ఎక్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్స్ అవార్డు’ను ఆ సంస్థకు ఇస్తున్నట్లు భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఫియో) ప్రకటించింది.
- ఇదీ చదవండి : ఇకపై ఎక్కడ చదివితే.. అక్కడే ఇంటర్న్షిప్
చెన్నైలో బుధవారం జరిగే కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ప్రియా ఫుడ్స్ ప్రతినిధులకు అవార్డు అందజేయనున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యుత్తమ ఎగుమతిదారుగా ఉన్న ప్రియా ఫుడ్స్ సంస్థ.. 2017-18 సంవత్సరానికిగానూ ‘టాప్ వన్ స్టార్ ఎక్స్‌పోర్ట్ హౌస్ ఇన్ సదరన్ రీజియన్’ కేటగిరీలో అవార్డును దక్కించుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.