కొవిడ్-19తో ఇబ్బందులు పడుతున్న వికలాంగుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. రాష్ట్రంలో సుమారు 12 లక్షల మంది వికలాంగులు ఉన్నారని ఆ వేదిక అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రస్తుతం 9 లక్షల మందికి కరోనా కారణంగా ఉపాధి లేక సతమతమవుతున్నారని వెల్లడించారు. మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తున్నారని కమిషన్‌కు వివరించారు.
కరోనా కారణంగా రాష్ట్రంలోని వికలాంగుల కుటుంబానికి 10 వేల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. హోం క్వారంటైన్లో ఉండే వికలాంగులకు లక్ష రూపాయలు, ఆస్పత్రిలో ఉన్న వారికి రెండు లక్షలు, మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వికలాంగుల కోసం ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేసి.. అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు. మాసబ్ ట్యాంక్‌లోని ప్రభుత్వ సదన్‌లో 20 మంది అంధులకు కరోనా సోకిందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీని కోరారు.
ఇదీ చూడండి : కరోనా వచ్చినా భయపడకండి: మేయర్ బొంతు రామ్మోహన్