పేదవారికి సేవ చేయాలనే బసవేశ్వరుడి బోధనలు అనుసరణీయమని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బసవతత్వా అనుభవమంటప ఉత్సవంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. బసవేశ్వరుడు దేశం కోసం విలువైన సందేశాలు ఇచ్చారని చెప్పారు. ఆహారం, ఇల్లు, వైద్యం, విద్య ప్రాథమిక హక్కులని 12వ శతాబ్దంలోనే చెప్పిన మహనీయుడు బసవేశ్వరుడని కొనియాడారు. తెలంగాణలో సుపరిపాలన అందిస్తున్నామని, రైతులు, పేదల అభ్యున్నతికి అహర్నిషలు కృషి చేస్తున్నామని వివరించారు. బసవేశ్వర చరిత్రను తెలంగాణ పాఠ్యపుస్తకాలలో పొందు పరిచేందుకు కృషి చేస్తానని చెప్పారు. సీఎంతోపాటు విద్యాశాఖ మంత్రితో మాట్లాడుతానని తెలిపారు. మంత్రివెంట ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఉన్నారు.
ఇవీ చూడండి : 'కేసీఆర్ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'