ఆనందయ్య (Anandaiah) ఔషధంపై ఏపీ హైకోర్టులో సోమవారం విచారణ జరగనుందని ఆయుష్ కమిషనర్ (Ayush commissiner) రాములు తెలిపారు. ఔషధ పరీక్షలపై రేపు చివరి నివేదిక వస్తుందని వెల్లడించారు. నివేదికలను అధ్యయన కమిటీ మరోసారి పరిశీలిస్తుందన్న రాములు... సీసీఆర్‌ఏఎస్(CCRAS) అధ్యయన నివేదిక రేపు వచ్చే అవకాశం ఉందని వివరించారు. నివేదికతో పాటు హైకోర్టు తీర్పు వచ్చాక ఔషధ పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
కంటి మందుపై ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం జగన్ (CM Jagan) ఆదేశించారని రాములు వివరించారు. ఇప్పటివరకు విచారణ నివేదికలు సానుకూలంగా వచ్చాయని తెలిపారు. టెలిఫోన్ విచారణలో చాలా మంది సానుకూలంగా చెప్పారని... ఔషధంపై క్లినికల్ ట్రయల్స్ ఇంకా ప్రారంభించలేదని వెల్లడించారు. ఆయుర్వేద విభాగం గుర్తింపు కోసం ఆనందయ్య దరఖాస్తు చేయాలని అన్నారు.
ఇవీచూడండి: Anandaiah: 'ఆనందయ్య మందుకు అనుమతివ్వాలి.. కార్పొరేట్‌కు లొంగొద్దు'