పాలిస్టర్ ఫిల్మ్ తయారీలో అగ్రగామిగా పేరొందిన ఏస్టర్ ఫిల్మ్ టెక్ లిమిటెడ్ కంపెనీ రాష్ట్రంలో ప్యాకేజింగ్ ఫిల్మ్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రూ.1350 కోట్ల పెట్టుబడితో షాబాద్ మండలం చందన్‌వెల్లిలో ఏర్పాటు కానున్న ఈ తయారీ యూనిట్ ద్వారా 800 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ప్యాకేజింగ్ పరిశ్రమకు కావాల్సిన పాలిమర్ ఉత్పత్తులను ఇక్కడ తయారు చేసి.. 30 నుంచి 40 శాతం వరకు ఎగుమతి చేయనున్నట్లు కేటీఆర్‌తో జరిగిన వర్చువల్ సమావేశంలో సంస్థ ఛైర్మన్ అరవింద్ సింఘానియా తెలిపారు.
రాష్ట్రంలో ఏస్టర్ కంపెనీ అడ్వాన్సెడ్ పాలిస్టర్ ఫిల్మ్ ఉత్పత్తి కేంద్రాన్ని త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఏస్టర్ రాకవల్ల ప్యాకేజింగ్ పరిశ్రమలో తెలంగాణకు ప్రత్యేక స్థానం వస్తుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.