ETV Bharat / city

viral: కుమార్తెను ప్రేమించిన యువకుడిపై క్రూరంగా దాడి - కుమార్తెను ప్రేమించిన యువకుడిపై దాడి

మధ్యప్రదేశ్​లో దారుణం జరిగింది. తన కుమార్తెను ప్రేమించిన యువకుడిపై ఆమె తండ్రి, సోదరుడు సుత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

attack
attack
author img

By

Published : Sep 14, 2021, 5:59 PM IST

Updated : Sep 14, 2021, 6:32 PM IST

తమ కుమార్తె ప్రేమించిన యువకుడిని ఆమె తండ్రి, సోదరుడు దారుణంగా కొట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. సుత్తితో, రాడ్లతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. షాజాపూర్ జిల్లా మక్సీ పట్టణంలో ఈ ఘటన జరిగింది.

ఇదీ జరిగింది:

మక్సీ పట్టణానికి చెందిన యువకుడు పుష్పక్ భవసర్​కు.. అదే ప్రాంతానికి చెందిన యువతి(22)తో స్నేహం ఏర్పడింది. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. కుటుంబ సభ్యులు వారి ప్రేమకు అడ్డు చెప్పడంతో.. ఇంట్లోంచి పారిపోయారు.

ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదురడంతో ప్రేమికులు ఇంటికి తిరిగొచ్చారు. భవసర్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న యువతి తండ్రి, సోదరుడు దీన్ని జీర్ణించుకోలేకపోయారు. కటింగ్ చేయించుకోవటానికి బయటకు వెళ్లిన క్రమంలో.. విచక్షణా రహితంగా సుత్తి, ఇనుప రాడ్లతో యువకుడి కాళ్లు, చేతులపై దాడి చేశారు.

ఈ దాడిలో పుష్పక్ భవసర్​కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులతోపాటు యువకుడిపై కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. యువకుడిపై కూడా కేసు నమోదుచేయడాన్ని తమ కుటుంబసభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. తమకు న్యాయం కావాలని వినతి పత్రం సమర్పించారు.

young lover attacked by girl father

ఇదీ చూడండి: Saidabad incident: ఇంకా దొరకని కామాంధుడు.. కారణం అదే.. ఇవిగో సీసీటీవీ దృశ్యాలు..!

Last Updated : Sep 14, 2021, 6:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.