ETV Bharat / city

ఏపీ: అమరావతి సంకల్ప ర్యాలీ... మార్మోగిన ఉద్యమ నినాదం

author img

By

Published : Jan 20, 2021, 8:39 PM IST

అమరావతి ఉద్యమ నినాదం రాజధాని గ్రామాల్లో మార్మోగింది. రైతుల పోరాటం 400 రోజులకు చేరిన సందర్భంగా రాజధాని గ్రామాల్లో అమరావతి సంకల్ప ర్యాలీని నిర్వహించారు. అన్ని రాజకీయ పక్షాల నేతలు ఈ ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపాయి. ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఐకాస నేతలు ప్రకటించారు.

amt farmers 400th day pkg
amt farmers 400th day pkg

అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్​తో రాజధాని రైతులు చేస్తున్న పోరాటం 400 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి ఐకాస భారీ ర్యాలీ నిర్వహించింది. 'అమరావతి సంకల్ప ర్యాలీ' పేరిట జరిగిన ఈ ర్యాలీ తుళ్లూరు నుంచి ప్రారంభమై రాజధాని గ్రామాల మీదుగా మందడం వరకూ సాగింది. ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్లతో రైతులు, రైతు కూలీలు, మహిళలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ఏపీ: అమరావతి సంకల్ప ర్యాలీ... మార్మోగిన ఉద్యమ నినాదం

ర్యాలీకి ఘన స్వాగతం...

ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, జై అమరావతి నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఉద్యమ గీతాలతో రాజధాని వాసులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. గ్రామాలు వచ్చినపుడు పాదయాత్ర చేపట్టారు. అన్ని గ్రామాల్లో ర్యాలీకి ఘన స్వాగతం లభించింది. అమరావతి ఐకాస పేరుతో రూపొందించిన ఆకుపచ్చని జెండాలు చేత పట్టుకుని ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ర్యాలీ సాయంత్రం 4.30 గంటల వరకూ సాగింది. తమ పోరాటాన్ని ప్రభుత్వం అవహేళన చేసినా మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతామని రైతులు తెలిపారు. అమరావతి పోరాటంలో కేవలం రాజధాని వాసులే కాకుండా రాష్ట్ర ప్రజలంతా కలిసి రావాలని ఐకాస నేతలు విజ్ఞప్తి చేశారు. ఇతర ప్రాంతాల్లోనూ ఉద్యమం విస్తరించేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు...

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్​తో పాటు తెదేపా నేతలు తెనాలి శ్రావణ్ కుమార్, సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, సీపీఎం నుంచి బాబూరావు, జనసేన తరఫున పోతిన మహేష్, భాజపా నాయకులు జమ్ముల శ్యామ్ కిషోర్, కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసీరెడ్టి, మహిళా నేత సుంకర పద్మశ్రీ ఈ ర్యాలీలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. రాజధాని మార్పు విషయంలో ప్రభుత్వ వైఖరిని వారు తీవ్రంగా ఖండించారు. రైతులు 400 రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో ప్రభుత్వం పెట్టిన కేసులు హైకోర్టు కొట్టివేయడాన్ని స్వాగతించారు. ఈ తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మొండి వైఖరి మాని రాజధాని అమరావతిలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన న్యాయం ఉందని.. అంతిమ విజయం వారిదేనని గల్లా జయదేవ్ అన్నారు.

ఇదీ చదవండి: ప్రేమ..పెళ్లి.. హత్య.. ఆత్మహత్య...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.