శుక్రవారం కనుమ పండుగ సందర్భంగా ఏపీ రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు అమరావతి వెలుగు పేరుతో ఆందోళన నిర్వహించారు. కృష్ణాయపాలెం, వెంకటపాలెం, బోరుపాలెంలో రైతులు, మహిళలు కాగడాలతో నిరసన తెలిపారు.
వెంకటపాలెం గంగానమ్మ ఆలయం వద్ద రైతులు, మహిళలు సెల్ ఫోన్ లైట్లతో నిరసన తెలిపారు. కృష్ణాయపాలెంలో రైతులు దీక్షా శిబిరం వద్ద కాగడాలతో మానవహారం చేపట్టారు.
- ఇవీ చదవండి : కారును లాగిన పులి-వీడియో వైరల్