ETV Bharat / city

ఈటల రాజేందర్ డమ్మీ మంత్రిగా మారారు: డీకే అరుణ - dk aruna zoom video conference on bjp leaders

ఈటల రాజేందర్ డమ్మీ మంత్రిగా మారారని మాజీ మంత్రి, భాజపా నేత డీకే అరుణ ఆరోపించారు. కరోనా వైరస్‌ను కట్టడిచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆమె ధ్వజమెత్తారు.

farmer-minster-dk-aruna-fire-on-health-minister-etala-rajender-and-trs-government
ఈటల రాజేందర్ డమ్మీ మంత్రిగా మారారు: డీకే ఆరుణ
author img

By

Published : Jun 28, 2020, 10:34 PM IST

హైదరాబాద్‌ కరోనా హబ్‌గా మారిందని మాజీ మంత్రి, భాజపా నేత డీకే అరుణ ఆరోపించారు. కేసీఆర్‌కు ఈటల రాజేందర్‌ మీద ఉన్న కోపమే ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు శాపమైందన్నారు. ఓనర్లు, క్లీనర్ల పంచాయితీలో కొవిడ్‌ను అడ్డం పెట్టుకుని తెరాస చేస్తున్న శవ రాజకీయాలతో ప్రజలు బలిపశువులు అవుతున్నారని డీకే అరుణ పేర్కొన్నారు. లక్షల్లో ఖర్చయ్యే కరోనా చికిత్స ఖర్చును పేద, మధ్య తరగతి ప్రజలు ఎలా భరిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వం టెస్టుల సంఖ్యను పెంచి ప్రజల ప్రాణాలను కాపాడాలన్నారు.

కరోనాపై మంత్రికి వాస్తవాలు తెలిసినా... సీఎంను ప్రశ్నించలేక పోతున్నాడని, తన పదవిని కాపాడుకునే పనిలో భాగంగా భాజపాపై విమర్శలు చేస్తూ.... కేసీఆర్ మెప్పు పొందే ప్రయత్నం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈటల రాజేందర్ డమ్మీ మంత్రిగా మారారని విమర్శించారు.

నిధుల ఖర్చు ఎలా పెట్టారో ...

టీమ్స్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వ నిధులు మింగే వరకు దాని మీద ఉన్న శ్రద్ద ఇప్పుడెందుకు లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన కరోనా నిధులు రూ. 7151 కోట్లతోపాటు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు వచ్చిన విరాళాలను ఎలా ఖర్చు పెట్టారో చెప్పే నిజాయితీ కేసీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు.

ఈటల రాజేందర్ డమ్మీ మంత్రిగా మారారు: డీకే ఆరుణ

ఇదీ చూడండి: ఆ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని ప్రధానికి కేసీఆర్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.