ETV Bharat / city

diamond: పుడమి పుత్రుడు.. ఒక్కరోజులోనే కోటీశ్వరుడయ్యాడు!

ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చిన్న జొన్నగిరిలో ఓ రైతుకు అదృష్టం కలిసొచ్చి ఒక్కరోజులోనే కోటీశ్వరుడయ్యారు. పొలానికి వెళ్తున్న రైతుకు మెరుస్తున్న రాయి కనిపించింది. తనతోపాటు ఇంటికి తీసుకొచ్చిన రాయిని.. స్థానిక వ్యాపారికి చూపించాడు. అనంతరం ఊహించని పరిణామానికి రైతు ఏం చేయాలో తోచలేదు. ఇంతకీ ఏం జరిగింది..

farmer found diamond
farmer found diamond
author img

By

Published : May 28, 2021, 10:17 AM IST

ఎప్పుడూ పుడమి తల్లి ఒడిలో ఉంటూ సేద్యం చేసుకునే ఓ రైతుకు అదృష్టం కలిసొచ్చి ఒక్క రోజులోనే కోటీశ్వరుడయ్యారు. ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చిన్న జొన్నగిరిలో గురువారం ఓ రైతు పొలానికి వెళ్లగా.. మిలమిలా మెరుస్తున్న రాయి ఆకర్షించింది. వజ్రంగా భావించి ఇంటికి తీసుకువచ్చాడు. స్థానిక వ్యాపారికి చూపించగా రూ.1.2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలిసింది.

30 క్యారెట్ల బరువున్న ఈ వజ్రం మార్కెట్‌ ధర రూ.2 కోట్ల వరకు ఉంటుందని ఈ విషయం బయటకు పొక్కిన తర్వాత ఇతర వ్యాపారులు చెబుతున్నారు. అంత సొమ్ము ఒక్కసారి చూసిన అన్నదాత.. దక్కిందే అదృష్టంగా భావించి ఇతరులకు తెలియజేయలేదని, వ్యాపారి సైతం గుట్టుగా ఉంచే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి: Birth Anniversary: మూగపడిన తెలంగాణ మూల్గిన తొలినాటి ధ్వనే.. సురవరం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.