ఏపీ రాజధాని ఉద్యమంలో మరో రైతు ప్రాణాలు కోల్పోయారు. రాజధాని తరలిపోతోందనే బాధతో తుళ్లూరుకు చెందిన జమ్ముల గోపాలరావు గుండెపోటుతో మృతిచెందారు. అమరావతి నిర్మాణానికి రైతు తనకున్న ఎకరం పొలాన్ని భూసమీకరణ కింద ప్రభుత్వానికి ఇచ్చారు. కొన్ని రోజులుగా తుళ్లూరులో జరుగుతున్న అమరావతి ఉద్యమంలో గోపాలరావు చురుగ్గా పాల్గొన్నారు. గోపాలరావు మృతి పట్ల తుళ్లూరు దీక్షా శిబిరంలో రైతులు సంతాపం ప్రకటించారు.
ఇవీ చదవండి: ప్రత్యేక రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి: ఇంద్రకరణ్ రెడ్డి