RRR Movie:తెలుగు రాష్ట్రాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సందడి నెలకొంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఏపీ, తెలంగాణల్లోని థియేటర్ల వద్ద అభిమానులు కేరింతలు కొడుతున్నారు. కానీ ఓ థియేటర్లో సినిమా ప్రారంభమైన కాసేపటికే నిలిచిపోయింది. దీంతో అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయి రచ్చ చేశారు.
ఏపీలో విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రదర్శనలో ఆటంకం ఏర్పడింది. షో ప్రారంభమైన గంట సేపటి తర్వాత స్క్రీన్ నిలిచిపోయింది. దీంతో అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎంతసేపటికీ సినిమా స్టార్ట్ కాకపోయేసరికి.. థియేటర్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
ఇదీ చదవండి:
''ఆర్‌ఆర్‌ఆర్' ఓ మాస్టర్ పీస్.. భారతదేశ అగ్నిపర్వతం'- సెలబ్రిటీల రివ్యూలు