Urusu festival at Kadapa pedda Dargah: ఏపీలో ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు ఇవాళ్టినుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 10 గంటలకు దర్గా పీఠాధిపతి ఆరిఫ్ ఉల్లా హుస్సేన్.. దర్గా ఆవరణలో చదివింపులు చదివిస్తారు. రాత్రి 8 గంటలకు పీఠాధిపతి ఆధ్వర్యంలో మాలింగు షాను పీరి స్థానంలో కూర్చోబెడతారు. రాత్రి 9.45 నిమిషాలకు పీఠాధిపతి తన నివాసం నుంచి గంధం తీసుకొచ్చి దర్గాలో సమర్పిస్తారు.

urusu celebration in kadapa dargah: అయితే ఒమిక్రాన్, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దర్గా ఉరుసు ఉత్సవాలను సాదాసీదాగా నిర్వహిస్తున్నారు. కేవలం దర్గాలోని శిష్యుల ఆధ్వర్యంలోనే వేడుక కొనసాగిస్తున్నారు. కవ్వాలి, జాతీయ స్థాయి కవి సమ్మేళనం, ఎగ్జిబిషన్, దుకాణాలు ఏర్పాటు తదితర వాటన్నింటిని రద్దు చేశారు. ఏకాంత సేవలోనే దర్గా ఉరుసు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దర్గా వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: Bandi Sanjay on Students Suicide : 'సర్కార్ తప్పు వల్లే ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు'