ప్రముఖ యాంకర్, నటుడు ఆనంద్ కన్నన్ (48) కన్నుమూశారు. 1990-20 మధ్య తమిళంలో నటుడిగా, వీజేగా చేసి ఆకట్టుకున్నారు. కన్నన్ ఆకస్మిక మరణం తమిళ చిత్ర పరిశ్రమని షాక్‌కు గురి చేసింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ, టీవీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఆనంద్ కన్నన్ యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించారు. సింగపూర్‌లో ఆయన యాంకరింగ్ చేసిన ఆయన ఆ తర్వాత చెన్నైకి వచ్చారు. ఓ ప్రముఖ రేడియోలో ఆర్జేగా చేశారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌లో వీజేగా,యాంకర్‌గా రాణించారు. చిన్న వయసులోనే యాంకర్‌గా పాపులరై పెద్దఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. టీవీ సీరియల్స్‌లోనూ, పలు సినిమాల్లోనూ నటుడిగా రాణించారు.
తమిళ సినీ నిర్మాత వెంకట్ ప్రభు, ఆర్జే ధీనా ట్విట్టర్ ద్వారా కన్నన్ మృతి పట్ల సంతాపం తెలిపారు.
ఇదీ చూడండి: Chathur Mukham Review: 'చతుర్ ముఖం' ఎలా ఉందంటే?