ETV Bharat / city

కుటుంబాలపై కరోనా పంజా.. ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు మృత్యువాత - ఏపీలో కరోనా వ్యాప్తి

ఆనందంగా సాగిపోతున్న కుటుంబాల్లో కరోనా విషాదాన్ని నింపుతోంది. ఒకే ఇంట్లో ఇద్దరు..ముగ్గురు చొప్పున మృత్యువాత పడుతున్నారు. కొన్నిచోట్ల ఇంట్లో చనిపోయిన వారి అంత్యక్రియలు పూర్తయ్యేలోపే మరొకరి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దంపతులు, కూతుళ్లు, కుమారులు, అత్తమామలు, సమీప బంధువులను ఈ రక్కసి బలి తీసుకుంటోంది. ఇంట్లో ఒకరికి వస్తే.. మిగిలిన వారు హడలిపోతున్నారు.

corona, corona effect on families, corona cases in ap
కరోనా, ఏపీలో కరోనా, కుటుంబమంతా కరోనా
author img

By

Published : May 13, 2021, 7:05 AM IST

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు పదిరోజుల వ్యవధిలో ప్రాణాలు విడిచారు. నెల్లూరు జిల్లా కావలిలో తండ్రీతనయులు ఒకేరోజు చనిపోయారు. విజయవాడలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఐదురోజుల వ్యవధిలో మృతి చెందారు. ఏపీ వ్యాప్తంగా ఇలాంటి..సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

తొలిదశలో కంటే..రెండో దశలో ఈ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది. కొందరిలో వైరస్‌ శరీరంలోకి చొచ్చుకుపోయి లక్షణాలు బయటకు రానీయకుండానే నష్టం చేస్తోంది. మరికొందరిలో లక్షణాలు బయటపడి.. నిర్ధారణ పరీక్ష చేయించుకుని ఫలితం కోసం వేచి చూసేలోపే ప్రభావాన్ని చూపుతోంది. అనుకోకుండా శ్వాస పీల్చుకోవడంలో సమస్యలు రావడంతో ఆసుపత్రులకు పరిగెడుతున్నారు. ఈ క్రమంలో కొందరిలో ఊపిరితిత్తులు పనిచేయకపోవడం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తి బాధితులు ప్రాణాలు విడుస్తున్నారు.

ఎందుకిలా?

వైరస్‌ సోకిన వ్యక్తికి కుటుంబ సభ్యులు ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌గా ఉండడం, ఇరుకు ఇళ్లలో నివాసం, వైరస్‌ వ్యాప్తి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, సకాలంలో వైద్యుల్ని సంప్రదించకపోవడం వంటి కారణాలవల్ల ఈ వరుస మరణాలు సంభవిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. వైరస్‌ మ్యుటేషన్‌ తీవ్రంగా ఉన్నందున కుటుంబ సభ్యులందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనలపై లోతుగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని కొందరు డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. కొన్నిచోట్ల కరోనా బాధితులు ఇంట్లో ఉన్న సమయంలో మాస్కు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా సాధారణ వ్యక్తిలా వ్యవహరిస్తున్నారు. అనుమానిత లక్షణాలు కనిపించినా.. కొందరు ఆలస్యంగా పరీక్షలు చేయించుకుంటున్నారు. మరికొందరు అర్హతలేని వైద్య సేవలు పొందుతున్నారు. ఈ క్రమంలో జరిగే జాప్యం తీవ్రత ప్రభావం బాధితుడిపైనే కాకుండా ఇంట్లోని కుటుంబసభ్యులపై ముఖ్యంగా వృద్ధులపై పడుతోంది. ఒక్కోసారి ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. అయితే టీకా రెండు డోసులు తీసుకున్నవారిలో మరణాల శాతం అతి స్వల్పంగా ఉంది.

డెంగీ విషయంలోనూ...

డెంగీ విషయంలోనూ గతంలో ఇదే జరిగింది. మొదటి విడతతో పోల్చితే రెండోసారి తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇప్పుడు కొవిడ్‌-19లోనూ అదే జరుగుతోంది. డెంగీలో 4 రకాలున్నాయి. ఒక్కో రకంలో ఒక్కో తీవ్రత బయటపడింది. మొదటిసారి డెంగీ వచ్చినప్పుడు దానికి తగినట్లు మనుషుల శరీరంలో యాంటీబాడీలు సిద్ధమయ్యాయి. రెండోసారి అది తీవ్రత మార్చుకుని వచ్చింది. అప్పుడు ఈ వైరస్‌ను పసిగట్టినప్పటికీ తీవ్రత గుర్తించకుండా శరీరం పాత యాంటీబాడీలతోనే దానిపై పోరాడింది. దీంతో అవి వైరస్‌ను నియంత్రించలేకపోగా.. రక్తంలో కలిసిపోయి ఇతర కణాలపై ప్రభావం చూపాయి.

వైరస్‌తోనే ఉన్నామని జాగ్రత్తపడాలి

"ఇళ్ల నుంచి బయటకు వచ్చే వారు అప్రమత్తంగా ఉండాలి. వైరస్‌కు దగ్గరగా ఉన్నామని భావిస్తూ వ్యవహరించాలి. పేద, మధ్యతరగతి ఇళ్లు ఇరుకుఇరుకుగా ఉంటాయి. అందరూ కలిసి ఒకేచోట ఉండాల్సి వస్తోంది. కొందరు తలుపులు, కిటికీలు మూసేసి ఉంచుతున్నారు. ఇంకొందరు చల్లదనం (ఏసీ) కోసం తలుపులు మూసి ఒకే గదిలో ఉంటున్నారు. దీనివల్ల బాధిత వ్యక్తి నుంచి వైరస్‌ బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోతున్నాయి. ఇంట్లో ఎవరికైనా కరోనా వస్తే దాని ప్రభావం ఆ ఇంట్లోని వృద్ధులపై తీవ్రంగా కనిపిస్తోంది. వీరిలో సహజంగానే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటోంది. బీపీ, షుగర్‌, ఆస్తమా వంటి సమస్యలున్న వారిలో యాంటీబాడీలు వైరస్‌ను తట్టుకోలేకపోతున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన పలువురు రోజుల వ్యవధిలోనే మరణించడాన్ని గమనిస్తే ఈ విషయం అర్థమవుతోంది. అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే రెండు మాస్కులు ధరించి కుటుంబసభ్యులకు దూరంగా ఉంటే మంచిది. వైద్యుల సలహాలు, సూచనలు కచ్చితంగా పాటిస్తే విలువైన ప్రాణాలు దక్కించుకోవచ్చు."

-ప్రొఫెసర్‌ శివశంకర్‌, సూపరింటెండెంట్‌, విజయవాడ జీజీహెచ్‌

మరణాల తీరుపై విస్తృతస్థాయిలో పరిశోధనలు జరగాలి

"కరోనా వైరస్‌ వ్యాప్తితో ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది చనిపోతున్న తీరుపై పరిశోధనలు జరగాలి. జనవరిలో ‘ఫ్రంటియర్స్‌ ఇన్‌ ఇమ్యూనాలజీ’ జర్నల్‌లో ఓ పరిశోధన పత్రం ప్రచురితమైంది. జీన్‌ వ్యవస్థకు, కొవిడ్‌-19 సోకడానికి ఒక విధమైన అనుబంధం ఉండొచ్చనే అభిప్రాయాన్ని అందులో వ్యక్తంచేశారు. మనిషిలోని హ్యూమన్‌ ల్యుకోసైట్‌ యాంటీజెన్‌ (హెచ్‌ఎల్‌ఏ) వ్యవస్థలో హెచ్‌ఎల్‌ఏ బీ27, హెచ్‌ఎల్‌ఏ 7, హెచ్‌ఎల్‌ఏ బీ7 లాంటి లింకేజీ జీన్‌లుంటాయి. ఒక జీన్‌ ఉన్న వారు జబ్బుబారిన పడితే ఆ లింకేజీ జీన్‌ జాబితాలో ఉన్నవారూ ఆ జబ్బుబారిన పడుతున్నారని గుర్తించారు. ఇంట్లో వైరస్‌ వ్యాప్తికి ఈ జీన్‌ లింకేజీ కూడా ఒక కారణం అవ్వొచ్చు. శరీరంలో వైరస్‌ను నియంత్రించడంలో ఇమ్యూన్‌ వ్యవస్థ అసమతుల్యంగా ఉండటం వల్లే జబ్బు తీవ్రమవుతోంది. దీన్ని సైటోకైన్‌స్టార్మ్‌ అంటారు. ఈ సైటోకైన్‌లన్నీ హిస్టమీన్‌ సైకిల్‌ ఆధీనంలో ఉంటాయి. ఇవి ఉత్తేజితమైతేనే సైటోకిన్లు యాక్టివ్‌గా ఉంటాయి. ఆ సైకిల్‌ను నియంత్రించడం ద్వారా అన్ని దుష్ప్రభావాల్ని ఆపొచ్చు."

- ప్రొఫెసర్‌ అప్పారావు పెద్దపల్లి, మైక్రోబయాలజీ విభాగాధిపతి, ఆంధ్ర వైద్య కళాశాల, విశాఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.