పెద్దలను కాదని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. బెదిరింపులకు భయపడి ఆత్మహత్యకు పాల్పడింది ఓ ప్రేమ జంట. భార్య మృతి చెందగా భర్త కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడపకు చెందిన శ్రీనివాస్, భార్గవి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అడ్డుచెప్పారు. వారిని కాదని అక్టోబర్ 30న మహానందిలో వివాహం చేసుకున్నారు. 31న అమ్మాయి తరఫు బంధువులు వచ్చి బెదిరించారు. తమను విడదీస్తారేమో అన్న భయంతో జమ్మలమడుగులోని గండికోట గ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరిని స్థానికులు జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భార్గవి మృతి చెందగా.. భర్త శ్రీనివాస్ మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి : నాన్న నాకు ఉద్యోగం రాదు..అందుకే నేను చచ్చిపోతున్నా..