ETV Bharat / city

ఎగిరొచ్చిన నోట్లు.. ఏరుకోవడానికి ఎగబడ్డ జనం..! - శ్రీకాకుళంలో రోడ్డు పక్కన నకిలీ నోట్ల కలకలం

Fake currency : 'డబ్బులు ఎవరికీ ఊరికే రావు' అని ఓ వ్యక్తి పత్రికలు, టీవీల్లో పదే పదే చెబుతూనే ఉంటాడు. ఆ డైలాగ్​ను మనం కూడా తరచుగా వాడుతుంటాం. కానీ.. డబ్బులు గాళ్లో నుంచి వచ్చి పడుతున్నప్పుడు మాత్రం ఆ డైలాగ్​ ఎవ్వరికీ గుర్తు రాదు.. వాటిని ఏరుకునే పనిలో పడిపోతారు అందరూ..! శ్రీకాకుళం జిల్లాలో ఇదే జరిగింది.

Fake currency
Fake currency
author img

By

Published : Jun 4, 2022, 9:12 AM IST

Fake currency : శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో శుక్రవారం గాల్లోంచి నోట్లు ఎగిరొచ్చి జనం ముందు పడ్డాయి..! నగరంలోని కొత్త వంతెనపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంకేముంది..? రోడ్డుపై ప్రయాణిస్తున్న వారంతా.. సడెన్​గా ఆగారు. దొరికిన నోట్లను తీసి దాచుకొని.. దొరకని నోట్లకోసం ఎగబడ్డారు..!

Fake currency
ఎగిరొచ్చిన నోట్లు.. ఏరుకోవడానికి ఎగబడ్డ జనం..!

దీంతో.. వాహనాలన్నీ రోడ్డుకు అడ్డదిడ్డంగా నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ చాలాసేపు నిలిచిపోయింది. ఫలితంగా.. కార్యాలయాలకు, ఇతర పనులకు వెళ్లే వారంతా ఇబ్బందులు పడ్డారు. పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాల్సి వచ్చింది. అయితే.. అసలు విషయం ఏమంటే.. గాల్లో ఎగిరొచ్చిన నోట్లన్నీ నకిలీవి..! గుర్తుతెలియని వ్యక్తులు ఈ నకిలీ నోట్లను పడేసుకుంటూ వెళ్లారు. ఈ విషయం తెలియని జనం.. కరెన్సీ నోటు కంట పడగానే ఏరుకోవడానికి ఎగేసుకెళ్లారు. అదన్నమాట సంగతి..!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.