ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. ఈనెల 12 నుంచి జరగనున్న ధ్రువపత్రాల పరిశీలన కోసం నేటి నుంచి స్లాట్ బుకింగ్ మొదలవుతుంది. కరోనా పరిస్థితుల్లో ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. అరగంటకు ఆరుగురు మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశామని.. కుల, నివాస, ఇతర ధ్రువీకరణ పత్రాల పరిశీలనంతా ఆన్‌లైన్‌లోనే పూర్తవుతుందని తెలిపారు. ఏయూసీటీఈ నిబంధనల ప్రకారం విద్యార్థులు కళాశాలలో చేరేటప్పుడు ఒరిజినల్ ధ్రువపత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటున్న నవీన్ మిత్తల్‌తో ముఖాముఖి.
ఇవీ చూడండి: పోలీసు అధికారి నుంచి కేంద్ర మంత్రి వరకు..