ETV Bharat / city

నెట్టింట్లో ఫేమస్​ అవుతున్న ఫేస్​యాప్​ ఛాలెంజ్ - ఫేస్​ యాప్

మొన్న పబ్​జీ, నిన్న టిక్​టాక్, నేడు ఫేస్​ యాప్ ఇలా... రోజుకో రకమైన యాప్​ నెట్టింట్లో సందడి చేస్తూ ట్రెండ్​ సృష్టిస్తోంది. భవిష్యత్​ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ ఉత్సుకతను క్యాష్​ చేసుకునేలా ఫేస్​ యాప్​ నెట్టింట్లో అడుగుపెట్టింది. ఈ యాప్​లో మన ప్రస్తుత ఫొటో అప్​లోడ్​ చేస్తే మనం వృద్ధాప్యంలో ఎలా ఉండబోతామో మార్ఫింగ్​ చేసి చూపెడుతుంది. తాము వృద్ధాప్యంలో ఎలా ఉంటామోన్న ఆసక్తి సామాన్యులే కాదు... టాలీవుడ్​, బాలీవుడ్​ సెలెబ్రీటీలకూ ఉంది. ఈ ఫేస్​యాప్​ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండ్​ అవుతున్నాయి.

face app trending
author img

By

Published : Jul 21, 2019, 6:04 AM IST

నెట్టింట్లో ఫేమస్​ అవుతున్న ఫేస్​యాప్​ ఛాలెంజ్

భవిష్యత్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి మొదటి నుంచి భారతీయుల్లో ఉంది. అందుకే జాతకాలు, వాస్తు, చిలక జోస్యం, పంచాంగాలకు అధిక ప్రాధాన్యమిస్తుంటారు. భవిష్యత్​పై ఉండే ఆసక్తిని రష్యాకు చెందిన ఓ కంపెనీ క్యాష్​ చేసుకోదలచింది. దానికోసమే పేస్​యాప్​ను తయారు చేసి మార్కెట్లో వదిలిపెట్టింది. గూగుల్ ప్లే స్టోర్​లో అడుగుపెట్టిన అనతికాలంలోనే వంద మిలియన్లకు పైగా డౌన్​లోడ్​లను సొంతం చేసుకుందంటే ఈ యాప్​కున్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ తరహా ఫేస్​యాప్​లు గతంలో అనేకం వచ్చినా.. దీనకున్న కచ్చితత్వం, యూజర్​ ఫ్రెండ్లీనెస్​తో ఆదరణ పొందింది.

ఎప్పుడెలా ఉంటారు!

ఇందులో ఉన్న ఏజ్ ఫిల్టర్లు ఒక మనిషి వృద్ధాప్యంలో ఎలా ఉంటారు, యవ్వనంలో ఎలా ఉంటారు, ప్రస్తుతం ఎలా ఉన్నారో వ్యత్యాసాన్ని మార్ఫ్ చేసి చూపెడుతుంది. ఎవరికైనా తమ ఓట్​ఫిట్​పై ఇతరులు ఏమనుకుంటారో అనే ఉత్సుకత దీనికి క్రేజ్ పెరిగేలా చేస్తోంది. ప్రస్తుత ఫొటోను, యాప్​లో మార్ఫ్ చేసిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేసి సంబురపడుతున్నారు. కేవలం యువతే కాదు పిల్లల నుంచి పెద్దల వరకు, సెలబ్రెటీలు, అన్ని రంగాల, అన్ని వయస్సుల వారిని ఈ యాప్ యమ అట్రాక్ట్ చేస్తోంది.

నాగ్.. ఫేస్​యాప్​కే ఛాలెంజ్​

2002లో నాగ్‌ ‘మన్మథుడు’ స్టిల్‌, 2019లో ఫేస్‌ యాప్ స్టిల్‌ను పక్కపక్కన ఉంచి అన్నపూర్ణ స్టూడియోస్​ ఓ ఫొటోను షేర్​ చేసింది. దానికి మన్మథుడు-2’లో ఇంకా యంగ్‌గా ఉన్న నాగ్‌ ఫొటోను కూడా జత చేసింది. నాగ్ అందాన్ని తగ్గించడం ఈ యాప్‌ తరం కూడా కాదని వర్ణిస్తూ.. ‘నాగ్‌ ఫేస్‌ యాప్‌ ఛాలెంజ్‌కే ఓ ఛాలెంజ్‌లాంటి వారు’ అని ట్వీట్‌ చేసింది. బాలీవుడ్​లో అనిల్​కపూర్​ను కూడా మరో యాభై ఏళ్లైనా, ఎన్ని యాప్​లొచ్చినా... ఏకే వయస్సు పెరగదంటూ నెటిజన్లు ట్వీట్​తున్నారు.

డేటా భద్రం

ఫేస్​యాప్​ను ఉపయోగించి ఫొటో మార్ఫింగే గాక అదనంగా గడ్డాలు అతికించటం, బ్యూటీ ఫిల్టర్లతో ఎడిట్ చేయటం వంటి అదనపు హంగులున్నాయి. ఈ యాప్​ల వాడకం, ఇన్​స్టాల్ చేసుకోవటంలో సెక్యూరిటీపై జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. యూఎస్​కు చెందిన సెనెటర్ దీని వాడకంపై ఎఫ్​బీఐ జోక్యం చేసుకోవాలని కోరారు. ఎడిట్ చేయాల్సిన ఫొటోతో పాటు.. తమ వ్యక్తిగత సమాచారాన్ని రష్యాకు చెందిన కంపెనీ క్లౌడ్​లో స్టోర్ చేసుకునే అవకాశం ఉందని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి వివరణగా అటువంటి అవసరం తమకేం లేదని ఫేస్​యాప్ యాజమాన్యం ప్రకటించింది.

స్పోర్టివ్​గా తీసుకోవాలి

ఇప్పటివరకు అటువంటి సెక్యూరిటీ సమస్యలేవీ గుర్తించకపోయినా.. ఈ రకమైన యాప్​లు ఇన్​స్టాల్ చేసుకునే ముందు భద్రతా నిబంధనలపై అవగాహన అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి వాటికి అడిక్ట్ కాకుండా జాగ్రత్తపడాలని.. సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక కామెంట్లు వస్తే ఆత్మన్యూనతకు లోను కాకుండా స్పోర్టివ్​గా తీసుకునే మనస్తత్వం అందరికీ ఉండదని హెచ్చరిస్తున్నారు.

మొత్తానికి ఫేస్ యాప్ మాత్రం ట్రెండింగ్​లో ఉంటూ అన్ని వయసుల వారిని ఆకర్షిస్తోంది.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.