కరోనా రెండో దశ ఉద్ధృతి దృష్ట్యా.... రాష్ట్రంలో ఈ నెల 20 వరకు కర్ఫ్యూ ఆంక్షలు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. నేటి నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేసింది. ఇక నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది.
నిత్యం... మధ్యాహ్నం 2 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ వేళల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: CCMB: కరోనా రాకుండా మాస్కు ఎలా ధరించాలో తెలుసా!