ETV Bharat / city

Expression of emotion in Medicine : వైద్యవిద్యలో భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యం - Expression of emotion in Medicine in important

శంకర్​దాదా ఎంబీబీఎస్​ సినిమాలో.. "రోగిని ప్రేమించలేని డాక్టర్​ కూడా రోగితో సమానం" అని ఓ డైలాగ్ ఉంటుంది. రోగులకు చికిత్స అందించడమొక్కటే వైద్యుడి పనికాదు. వారితో ప్రేమగా మసులుకుంటూ.. వారికి భరోసానివ్వడం కూడా ముఖ్యమే. అందుకే రోగులతో ఎలా మాట్లాడుతున్నారు? ఎలా ప్రవర్తిస్తున్నారు? వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నాయో ఎలా తెలుసుకుంటున్నారు అనే అంశాలు వైద్యచికిత్సలో చాలా కీలకమైనవి. అందుకే జాతీయ వైద్య కమిషన్(ఎన్​ఎంసీ(National Medical Commission)) పీజీ వైద్య విద్యార్థులు భావ వ్యక్తీకరణ సామర్థ్యాన్ని(Expression of emotion in Medicine) పెంపొందించుకునేందుకు అధిక ప్రాధాన్యమిస్తోంది.

Expression of emotion in Medicine
Expression of emotion in Medicine
author img

By

Published : Oct 22, 2021, 8:46 AM IST

రోగులతో ఎలా మాట్లాడుతున్నారు? వారి నుంచి సమాచారాన్నెలా స్వీకరిస్తున్నారు? తదితర అంశాలు పీజీ కోర్సుల్లో చాలా ముఖ్యమైనవని జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ(National Medical Commission)) భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పీజీ వైద్య విద్యార్థులు భావ వ్యక్తీకరణ సామర్థ్యాన్ని(Expression of emotion in Medicine) పెంపొందించుకునేందుకు అధిక ప్రాధాన్యమిస్తోంది. ఎంబీబీఎస్‌ తుది సంవత్సరంలో నిర్వహించనున్న ‘నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్టు’ను ప్రతి సంవత్సరం నిర్వహించనున్నారు.

ఈ పరీక్షలో సాధించిన మార్కుల ప్రాతిపదికనే పీజీ సీట్లను కేటాయిస్తారు. ఎగ్జిట్‌ పరీక్ష అమలయ్యే వరకూ.. ప్రస్తుతం నిర్వహిస్తోన్న పీజీ నీట్‌ పరీక్ష ఇలాగే కొనసాగుతుంది. ఎగ్జిట్‌ పరీక్షలో సాధించిన మార్కులు మూడేళ్ల వరకూ వర్తిస్తాయి. మూడేళ్లలో సీటు పొందకపోతే మళ్లీ కొత్తగా పరీక్షను రాయాల్సి ఉంటుంది. విదేశాల్లో ఎంబీబీఎస్‌ చేసి భారత్‌లో పీజీ చేయాలనుకునేవారు తప్పనిసరిగా ఎగ్జిట్‌ పరీక్ష రాయాలి. దీన్ని రాయడానికి ముందుగా.. ఆ అభ్యర్థులు దిల్లీలో ఎన్‌ఎంసీలో తమ సమాచారాన్ని నమోదు చేయించుకోవాలి. పీజీ వైద్య విద్య క్రమబద్ధీకరణపై ఎన్‌ఎంసీ రూపొందించిన తుది నమూనా పత్రాన్ని తాజాగా విడుదల చేసింది.

నమూనా పత్రంలోని ముఖ్యాంశాలు..

  • పీజీ వైద్యవిద్యలో భాగంగా విద్యార్థులు తొలి ఏడాదిలోనే పరిశోధన, నైతిక విలువలు, బేసిక్‌ కార్డియాక్‌ లైఫ్‌ సపోర్ట్‌ స్కిల్స్‌ వంటి మూడు అంశాల్లో తప్పనిసరిగా శిక్షణ పొందాలి. ఈ మూడింటిలో ఉత్తీర్ణత సాధిస్తేనే పీజీ పరీక్షల్లో ప్రవేశానికి అర్హత లభిస్తుంది.
  • పీజీ చేసేటప్పుడు విద్యార్థులను జూనియర్‌ రెసిడెంట్లుగా, సూపర్‌ స్పెషాలిటీలో సీనియర్‌ రెసిడెంట్లుగా పరిగణిస్తారు.
  • ఒక్కసారి సీటు పొందితే ఆ తర్వాత ఆ కళాశాల నుంచి మరో కళాశాలకు, కోర్సు నుంచి మరో కోర్సుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చరు.
  • ఐదేళ్ల పాటు సహాయ ఆచార్యులుగా పనిచేశాక పీజీ కోర్సుల్లో విద్యార్థులకు గైడ్‌గా అర్హత లభిస్తుంది. సూపర్‌ స్పెషాలిటీ విద్యార్థులకు గైడ్‌ చేయాలంటే మాత్రం రెండేళ్ల అనుభవం ఉండాలి.
  • ఏ వైద్యకళాశాలలోనైనా పీజీ కోర్సులు ప్రారంభించాలంటే ముందుగా ఆ ఆసుపత్రిలో సీటీ, ఎంఆర్‌ఐ స్కానింగ్‌ పరికరాలుండాలి.
  • కొన్ని వైద్యకళాశాలల్లో ల్యాబ్‌లను ఔట్‌సోర్సింగ్‌ చేస్తున్నారు. ఈ తరహా ప్రక్రియలకు ఇక అనుమతి ఉండదు. సొంతంగా అధునాతన ల్యాబ్‌ను సమకూర్చుకోవాలి.
  • ప్రతి విభాగంలోనూ డిజిటల్‌ లైబ్రరీ, ఒక సెమినార్‌ హాల్‌, వైఫై సేవలు అందుబాటులో ఉండాలి.
  • బ్రాడ్‌ స్పెషాలిటీ చేసే విద్యార్థులు ఇతర విభాగాల్లోనూ నాలుగు నెలలు శిక్షణ పొందాల్సి ఉంటుంది. శిక్షణలో భాగంగా ఎన్ని సర్జరీలు చేశారు? ఎన్నింటికి సహాయకులుగా ఉన్నారు? తదితర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడూ పొందుపర్చాలి.
  • అన్ని విభాగాల పీజీ విద్యార్థులు కనీసం వంద పడకలున్న ఆసుపత్రుల్లో మూడు నెలల పాటు పనిచేయాల్సి ఉంటుంది.
  • పీజీ క్లినికల్‌ కోర్సులు ప్రారంభించాలంటే.. వాటి కంటే ముందుగా అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ వంటి వాటిల్లో పీజీ సీట్లను పొందాలి. ఎంబీబీఎస్‌ కోర్సుల్లేని కళాశాలలకు ఈ నిబంధన వర్తించదు. ఉదాహరణకు నిమ్స్‌ వంటి వైద్య సంస్థల్లో.

ఇదీ చదవండి : 'డ్రగ్స్​ కేసులో బాలీవుడ్​ను కావాలనే టార్గెట్‌ చేశారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.