మీకోసం ముస్తాబులు..
అపారమైన ప్రేమను మీ భాగస్వామికి అందించాలనే ఉంటుంది. కానీ ఆ దారే తెలియదు. అయితే CherishX ప్రయత్నించండి. మీరు కలుసుకునే ప్రదేశం అందంగా ముస్తాబు చేసి పెడతారు క్యాండిల్ లైట్ డిన్నర్లు, సర్ప్రైజ్బహుమానాలు, మర్చిపోలేని అనుభవాలు గుదిగుచ్చి మీ ప్రేయసి/ ప్రియుడికి అందిస్తారు. చాక్లెట్ కార్డులు, మూవీ డిన్నర్లు, బెలూన్ సర్ ప్రైజ్ లు, ఫలానా టైమ్ కి గెస్టు అందించడాలు.. ఏదైనా సరే. దేశంలోని ఎనిమిది నగరాల్లో సేవలందిస్తున్నారు వీళ్లు.
నాడీ పట్టేస్తుంది
మీకు గుర్తుందా? టీనేజీలో మనం ఇష్టపడేవాళ్లకి మన పై ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి ఇద్దరి పేర్లు పక్కపక్కనే రాసేవాళ్లం. ఒక్కో అక్షరం చెరిపేస్తూ మిగిలిన అక్షరాల ఆధారంగా వాళ్లకు మనపై ఉన్నది ఆకర్షణా? ప్రేమా? ఇష్టమా అంటూ.. చర్చించుకునేవాళ్లం. 'లవ్ మీటర్ అలాంటిదే. గూగుల్ ప్లే స్టోర్, ఐవోఎస్ యాప్ స్టోర్‌లో ఉంది. మీ లవర్ పేరు, వివరాలు నమోదు చేస్తే చాలు.. తనకి మీపై, మీకు తనపై ఎంత ప్రేమ ఉందో సరదాగా తెలుసుకోవచ్చు
లవ్ గురూ ఇది
బంధం బలపడాలంటే ఇరువురి మధ్య మంచి సంభాషణలు ముఖ్యం, ఎలా మొదలు పెట్టాలి? ఎక్కడ పొడిగించాలి ఆకట్టుకునేలా వాళ్లతో ఏం కబుర్లు చెప్పాలి..ఇవేం మీకు తెలియకపోతే Talk2You Conversation Starter లవ్ గురూలా ఆ సంగతులన్నీ తెలియజెపుతుంది. మీరడిగిన సందేహాలన్నింటికీ సమాధానాలు ఇస్తుంది.
ఇవీ చూడండి: ఐ లవ్యూ అని చెప్పడం కామన్.. సో థింక్ డిఫరెంట్