దుబ్బాక ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో దొరికిన డబ్బులు తనవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్రువీకరిస్తూ ప్రకటన చేశారని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. దొరికిన డబ్బులు ఎవరివో దర్యాప్తు చేయకుండానే కేసు నమోదు చేశారని... దీంతో సమాజంలో తన ప్రతిష్టకు భంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు న్యాయవాది ద్వారా నోటీసులు పంపించినట్టు తెలిపారు. వారం రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే... వంద కోట్ల పరువునష్టం దావా వేయనున్నట్టు వెల్లడించారు.
ఇదీ చూడండి: ఈటీవీ భారత్: అరచేతిలో బల్దియా పోలింగ్ అప్డేట్స్